నటసార్శభౌమ, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా అభిమానులు, తేదాపా కార్యకర్తలు రాష్ర్ట వ్యాప్తంగా ఎక్కడిక్కడ జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పచ్చ మీడియా సమంక్షంలో అన్ని ఈవెంట్లను దాదాపు కవర్ చేయడం జరిగింది. అయితే లాక్ డౌన్ నిబంధనలు మాత్రం పచ్చ తమ్ముళ్లు గాలికి వదిలేసారు. కేకులు కట్ చేయడంలో భాగంగా ఒకిరిపై ఒకరు పడిపోవడం…ఒకరి నోట్లో మరొకరు వేలు పెట్టి తినిపించడం చేసారు. ఆ క్షణమేదా అలా చేసారుకున్నా! అంతకు ముందు కూడా కనీసం భౌతిక దూరం పాటించలేదు. రాష్ర్టంలో చాలా చోట్ల జరిగిన సన్నివేశాలివి. అయితే అనంతపురంలో మాత్రం ఇంకాస్త అతి జరిగింది.
స్టానిక టీడీపీ నేతలైన బండారు శ్రావణి ఎంఎస్ రాజు తమ బలం నిరూపించుకునేందుకు పోటాపోటీగా జయంతి సమావేశాలు నిర్వహించారు. ఎంఎస్ రాజు శింగనమల టీడీపీ ఆఫీస్ లో నిర్వహించగా, రామాలయంలో బండారు శ్రావణి జయంతి వేడుకలను పోటీ నిర్వహించారు. ఇక్కడ పోటీ అన్న మాటే గానీ….బండారు శ్రావణి కట్ చేసిన కేకును ఎం ఎస్ రాజు శింగనమల వర్గం తింది. ఈ వర్గం కట్ చేసిన కేకును బండారు శ్రావణి వర్గం తినడం విశేషం. సాధారణంగా ఇలా ఎక్కడా జరగదు. ఇక్కడ కొట్టుకున్నా అధికారంలో ఉంది జగన్ ప్రభుత్వం కాబట్టి ఏం లాభం లేదు .కాబట్టి కేకులతో సరిపెట్టుకున్నారు. అయితే వీళ్లెవరూ కూడా భౌతిక దూరం పాటించలేదు.
ప్రభుత్వం నిబంధనలను తుంగలోకి తొక్కి ఇష్టాను సారం వ్యవహరించారు. పోలీసులు ఎంత చెప్పినా..హెచ్చరించినా పట్టించుకోలేదు. దీంతో పోలీసులే అక్కడ నుంచి వెనుదిగారు. ఎవరిపై ఎలాంటి కేసులు గట్రా పెట్టకుండా వెనక్కి వెళ్లిపోయారు. అయితే ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. అక్కడ అధికారుల నిర్ణయాన్ని బట్టి జయంతి సందర్భంగా నేడు చోటు చేసుకున్న సంఘటనలపై రివ్యూ చేసిన తర్వాత చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
