Rajinikanth: ఆ హీరో బాటలో పయనిస్తున్న సూపర్ స్టార్ రజినీకాంత్.. ఏకంగా టాలీవుడ్ డైరెక్టర్?

Rajinikanth: ఇప్పటి వరకు దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు నటించిన సినిమాలు ఇతర భాషలలో డబ్ అవుతూ ఇతర భాష ప్రేక్షకులను కూడా సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో తమిళ చిత్రాలను తెలుగులో డబ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇప్పటివరకు ఏ ఒక్క తమిళ హీరో కూడా తెలుగులో స్ట్రైట్ సినిమాలు చేయలేదు. కానీ మొట్టమొదటిసారిగా హీరో ధనుష్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో పూర్తి స్థాయి తెలుగు చిత్రంలో నటిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు మొట్టమొదటి సారిగా ధనుష్ ఇలా పూర్తిస్థాయి తెలుగు చిత్రంలో నటిస్తున్న తమిళ హీరోగా నిలిచారు.

అయితే ప్రస్తుతం హీరో ధనుష్ బాటలోనే సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా పయనిస్తున్నట్లు తెలుస్తోంది. రజినీకాంత్ రోబో చిత్రం తర్వాత ఇప్పటివరకు తెలుగులో ఒక సినిమాతో కూడా ప్రేక్షకులను సందడి చేయలేక పోయారు.తాజాగా దీపావళి కానుకగా రజనీకాంత్ నటించిన పెద్దన్న సినిమా తెలుగులో విడుదలై ఈ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశ పరిచింది. ఇకపోతే ఈ సినిమా తర్వాత రజనీకాంత్ ప్రస్తుతం పలువురు దర్శకులు చెప్పిన కథలను వింటున్నారని తెలుస్తోంది.

అయితే రజనీకాంత్ తన తదుపరి చిత్రాన్ని పూర్తి స్థాయి తెలుగులో నటించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం..అందుకోసమే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ చెప్పిన కథను విన్న రజనీకాంత్ ఈ సినిమాలో నటించడానికి సానుకూలంగా ఉన్నారని తెలుస్తోంది. ఇలా పూర్తిస్థాయి తెలుగు చిత్రంలో నటించి తెలుగులో మరొకసారి నిలదొక్కుకోవాలనే ఆలోచనలో రజినీకాంత్ ఉన్నట్లు తెలుస్తుంది.