Pushpa 2: ‘పుష్ప 2’ లో అవకాశం అందుకున్న స్టార్ హీరోయిన్ ఇంద్రజ!

Pushpa 2: ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇంద్రజ గురించి తెలియనివారు ఎవరూ లేరు. తన అందంతో ఎంతోమందిని అభిమానులుగా మార్చుకుంది. ప్రస్తుతం బుల్లితెరపై జడ్జిగా బాధ్యతలు చేపట్టింది. ఇక ఇప్పటికీ ఈమె అందంలో ఎటువంటి మార్పు లేదు. ఇదిలా ఉంటే తనకు పుష్ప 2లో అవకాశం వచ్చిందని తెలుస్తుంది.

ఒకప్పటి స్టార్ హీరోయిన్ లంతా ప్రస్తుతం వస్తున్న స్టార్ హీరోల సినిమాలలో కీలక పాత్రలో నటిస్తున్నారు. అందుకే చాలామంది రీఎంట్రీ ఇవ్వగా.. ఇంద్రజ కూడా పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది. ప్రస్తుతం ఆమె స్టాండప్ రాహుల్ సినిమాలో నటిస్తుంది. ఇక తాజాగా తనకు పుష్ప 2 లో అవకాశం వచ్చిందని టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో కీలక పాత్ర కోసం సుకుమార్ ఇంద్రజ ను సంప్రదించారని తెలిసింది.