ఎవరా హీరోయిన్.? ఎందుకంతలా నిర్మాతని ఏడిపిస్తోంది.?

Small Heroine Becomes | Telugu Rajyam

ఆమె ఓ చిన్న హీరోయిన్.. అంటే, చిన్న సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చింది. ఈ మధ్యనే ఓ మోస్తరు సినిమాలో నటించి అందరి దృష్టినీ ఆకర్షించింది. కానీ, ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా ప్రమోషన్లకి అంతగా సహకరించడంలేదట.

తెలుగుతోపాటు ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తోన్న ఆ బ్యూటీ, హీరోయిన్‌గా ఎందుకు స్టార్‌డమ్ దక్కించుకోవడంలేదు.? అన్న ప్రశ్నకు ఆమె ఆటిట్యూడ్ కారణమని అంటున్నారు. నిర్మాతల్ని ముప్పు తిప్పలు పెట్టేస్తోందట. గొంతెమ్మ కోర్కెలూ కోరేస్తోందట.

అయితే, ఇదంతా ఆమె చుట్టూ జరుగుతున్న దుష్ప్రచారమేనన్న వాదనలూ లేకపోలేదు. అదే సమయంలో, సదరు హీరోయిన్ గురించి ఫిలిం సర్కిల్స్‌లో కుప్పలు తెప్పలుగా గాసిప్స్ వస్తూనే వున్నాయి. ఇతర హీరోయిన్లపై లేని గాసిప్స్ ఆమె మీదనే ఎందుకు వస్తున్నాయన్నదీ ఆలోచించాల్సిన విషయమే.

బోల్డంత ఫ్యూచర్ వున్న ఆ హీరోయిన్.. ఇలా ఎందుకు చేస్తోంది.? ఆమె అలా చేయకపోతే, ఆమెపై దుష్ప్రచారం చేస్తున్నదెవరు.? ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.? బిగ్ సస్పెన్స్ అంతే.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles