షాకింగ్ : ప్రభాస్ పైనే కౌంటర్ వేసిన “గాడ్ ఫాదర్” నిర్మాత.?

ఇప్పుడు టాలీవుడ్ సినిమా దగ్గర లేటెస్ట్ మెగా హిట్ “గాడ్ ఫాదర్” కోసం అంతా చెప్పుకుంటుండగా మరోపక్క పాన్ ఇండియా అంతా పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ కోసం చెప్పుకుంటున్నారు. అయితే తాజాగా వచ్చిన ఈ సినిమా ఫస్ట్ లుక్ నుంచి మొన్న టీజర్ వరకు కూడా ఎందుకో చాలా రకాలుగా రామ్ చరణ్ తో పోలుస్తూ కంపారిజన్స్ వచ్చాయి.

రాముని గెటప్ లో ప్రభాస్ కన్నా చరణ్ నే బాగా సెట్ అయ్యాడని పాన్ ఇండియా ఆడియెన్స్ కూడా అన్నారు. దీనితో ఒకింత ప్రభాస్ ని తక్కువ చేసినట్టే అనిపించింది. అక్కడ నుంచి కొందరు సినీ ప్రముఖులు ఐతే ఈ సినిమా విషయంలో అంత పాజిటివ్ గా కూడా లేరు. ఇప్పుడు లిస్ట్ లో చేరినట్టుగా గాడ్ ఫాదర్ నిర్మాత ఎం వి ప్రసాద్ షాకింగ్ కామెంట్స్ చెయ్యడం జరిగింది.

ఇప్పుడు ప్రపంచం, దేశానికి గాను రాముడు అంటే ఒక్క రామ్ చరణ్ బాబు మాత్రమే అని తెలిపారు. అయితే ఇది మాత్రం డెఫినెట్ గా ప్రభాస్ కే కౌంటర్ లా అనిపిస్తుంది. నిజానికి ఈ మాట చెప్పే సందర్భం కూడా అది కాదు కానీ అయినా అనడంతో ప్రభాస్ పైనే కౌంటర్ లా ఇది అనిపిస్తుంది.