Ram Charan : ఇండస్ట్రీ బజ్ : చరణ్ ని రెండు రకాలుగా శంకర్ చూపించబోతున్నాడా??

Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియా మల్టీస్టారర్ చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) రిలీజ్ కి రెడీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అనేక అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రాన్ని తర్వాత రామ్ చరణ్ ఎలాంటి సినిమా చేస్తాడా అనుకుంటే ఆ సమయంలో ఊహించని మరో ఇండియా టాప్ దర్శకుడు శంకర్ తో అనౌన్స్ చేసి ఒక్కసారిగా సంచలనం రేపాడు.

మరి ఈ భారీ సినిమా అనౌన్స్ చేసిన మొదలు అనేక అంచనాలు నెలకొల్పుకోగా భారీ తారాగణం తో శంకర్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. మరి ఇప్పుడు ఈ సినిమాపై ఇంకో క్రేజీ సమాచారం ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ ని శంకర్ రెండు రకాలుగా ప్రెజెంట్ చెయ్యబోతున్నాడని తెలుస్తోంది. అంటే ఈ చిత్రంలో రామ్ చరణ్ తో డ్యూయల్ రోల్ శంకర్ చేయిస్తున్నాడట.

దీనితో ఈ టాక్ ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. మరి శంకర్ సినిమాల్లో డబుల్ ట్రీట్ అంటే ఇప్పటి వరకు ఫైల్ అయ్యింది లేదు. సో ఈ సినిమాకి కూడా హిస్టరీ రిపీట్ అవ్వడం గ్యారెంటీ అని చెప్పాలి. ఇక ఈ భారీ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్నారు.