Rajamouli-RRR: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ పై స్పందించిన సమంత.. మాటల్లేవ్ అంటూ సమంత కామెంట్స్ వైరల్!

Rajamouli-RRR: రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఎన్నో అంచనాలు నెలకొన్నాయి.ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయడంతో ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటూ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేసింది.ఇలా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ట్రైలర్ పై ఎంతో మంది సినీ ప్రముఖులు స్పందిస్తూ వారి అభిప్రాయాన్ని తెలిపారు. ఈ క్రమంలోనే ఈ ట్రైలర్ చూసిన సమంత తనదైన శైలిలో కామెంట్ చేస్తూ స్పందించారు.

ఈ సందర్భంగా సమంత ఈ సినిమా ట్రైలర్ గురించి మాట్లాడుతూ మాటల్లేవు అంటూ ట్వీట్ చేయడమే కాకుండా చరణ్, తారక్ ను ఉద్దేశించి చేసిన పోస్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా సమంతా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ రామ్ చరణ్ లో తెరపై చూసిన అత్యుత్తమ ట్రాన్స్ఫర్మేషన్ ఇది అంటూ అల్లూరి సీతారామరాజు లుక్ పోస్ట్ చేశారు. అలాగే ఎన్టీఆర్ ను ఉద్దేశిస్తూ.. నీ చురకత్తి లాంటి చూపులు, కళ్ళల్లో ఉన్న ఆ ఫైర్ తో తారక్ దేనినైనా సాధించగలడని తనకు ఆ విషయంలో వందశాతం నమ్మకం ఉందని తారక్ గర్జిస్తున్నటువంటి ఫోటోలు షేర్ చేశారు.

ప్రస్తుతం సమంత ఈ సినిమా ట్రైలర్ గురించి చేసిన ట్వీట్, పోస్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సమంత షేర్ చేసిన ఈ ఫోటోలను చూసిన మెగా అభిమానులు నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ గా ఫీల్ అవుతున్నారు. ఇక ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా ట్రైలర్ పై ఇదివరకే మహేష్ బాబు, చిరంజీవి వంటి ప్రముఖులు సైతం వారి అభిప్రాయాలను వెల్లడిస్తూ చిత్రబృందం పై ప్రశంసలు కురిపించారు.