Samantha: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటి సమంత ఒకరు. ఈమె ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అయితే ఇటీవల కాలంలో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల సమంత సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు కానీ ఆమె ఆరోగ్యం పూర్తిగా కోలుకోవడంతో తిరిగి బిజీ అవుతున్నారు.
సోషల్ మీడియాలో సమంత నిత్యం యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక ఇటీవల కాలంలో సమంతకు సంబంధించి ఏ చిన్న విషయమైనా కూడా అభిమానులతో పంచుకుంటున్నారు అయితే కొన్నిసార్లు సమంత చేసే పోస్టులు పలు వివాదాలకు కూడా కారణం అవుతూ ఉన్నాయి.
ప్రస్తుతం సమంత తన నిర్మాణ సంస్థలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శుభం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా సమంత సోషల్ మీడియా వేదికగా ఒక ప్రెగ్నెన్సీ వీడియోని షేర్ చేశారు. ఒక్కసారిగా బేబీ బంప్ కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే సమంత షేర్ చేసిన ఈ బేబీ బంప్ వీడియో తనది మాత్రం కాదండోయ్.. ప్రస్తుతం సమంత శుభం సినిమా పనులలో బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలోనే సమంత అభిమాని సుహానా అనే మహిళ గర్భంలో ఉన్న తన బిడ్డతో పాటు సమంత సినిమా కోసం ప్రమోషన్స్ నిర్వహిస్తున్నట్టు ఈ వీడియోని షేర్ చేశారు. దీంతో సమంత ఫిదా అవటమే కాకుండా వెంటనే ఆ వీడియోని తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ క్యూటెస్ట్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అయితే ఈ స్టోరీ చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు అదేంటి సమంత బేబీ బంప్ తో ఉన్నారా అని ఆశ్చర్య వ్యక్తం చేశారు కానీ చివరికి తన సినిమా కోసం అభిమాని చేసిన పని అని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు.