Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత విడాకుల ప్రకటన తర్వాత ప్రతి రోజు ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. ఇకపోతే ఈమె విడాకులు ప్రకటన చేసిన అనంతరం ఈమె గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా సమంత ప్రెగ్నెన్సీ విషయం గురించి బోలెడు వార్తలు వినిపించాయి.సమంత తల్లి కావడం ఇష్టం లేదని అందుకే అక్కినేని కుటుంబం సమంతను దూరం పెట్టినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ విషయాలపై సమంత స్పందిస్తూ తనదైన శైలిలో సమాధానం చెప్పారు.
ఇదిలా ఉండగా తాజాగా సమంతకు ప్రెగ్నెన్సీ గురించి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది.ఈ సందర్భంగా మీరు ప్రెగ్నెంటా అని సమంతను అడగడంతో వారికి దిమ్మతిరిగే సమాధానం చెప్పారు. ఈ ప్రశ్నకు సమంత చెప్పిన సమాధానం వింటే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. ఈ సందర్భంగా సమంత సమాధానం చెబుతూ నేను 2017 నుంచి గర్భవతిని. ఈ పాప నిజంగా బయటకు రావాలని కోరుకోవడం లేదు అంటూ సమంత సమాధానం చెప్పారు.
సమంత వివాహం 2017 లో జరిగిన విషయం తెలిసిందే వీరీ పెళ్లి అయినప్పటినుంచి సమంత గర్భవతి అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి ఈ క్రమంలోనే సమంత తన ప్రెగ్నెన్సీ గురించి ఈ విధమైనటువంటి సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. ఇకపోతే సమంత తాజాగా కాజల్ ప్రెగ్నెన్సీ పై స్పందిస్తూ.. తనకు శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా బుల్లి కాజల్ అగర్వాల్ కోసం తాను ఎంతగానో ఎదురు చూస్తున్నట్లు తెలిపిన సంగతి మనకు తెలిసిందే.
