RRR Trailer Sensation : దుమ్ము లేపుతున్న “RRR” ట్రైలర్..ఇంకో ఇండియన్ రికార్డ్!

RRR Trailer Sensation :  ఎలాంటి సందేహం లేకుండా టాలీవుడ్ సహా టోటల్ పాన్ ఇండియన్ సినిమా వీక్షకులు ఎంతో ఆసక్తిగా, ఎక్కువగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) అనే చెప్పాలి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్ మరియు అజయ్ దేవగన్ లు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం రీసెంట్ గా మళ్ళీ కొత్త రిలీజ్ డేట్ ని తెచ్చుకొని మరింత హైప్ ని సెట్ చేసింది.

అయితే ఈ సినిమా ఆల్ మోస్ట్ రిలీజ్ కి రెడీ అయ్యిన టైం లోనే దీనిపై ఉన్న అంచనాలు మరింత రెట్టింపు చేసింది మాత్రం ఈ చిత్రం ట్రైలర్ అని చెప్పాలి. మైండ్ బ్లోయింగ్ విజువల్స్ తో రాజమౌళి చూపించిన ఈ ట్రైలర్ ప్రపంచ వ్యాప్తంగా సంచలన రెస్పాన్స్ ని అందుకుంది. మరి ఇప్పుడు అయితే ఈ ట్రైలర్ హవా మరింత స్థాయిలో కొనసాగుతున్నట్టు తెలుస్తుంది.

లేటెస్ట్ గా ఈ సినిమా ట్రైలర్ మొత్తం 5 భాషల్లో కలిపి ఏకంగా 150 మిలియన్ వ్యూస్ మార్క్ ని క్రాస్ చేసి ఇంకో ఫాస్టెస్ట్ రికార్డు ని సెట్ చేసింది. దీనితో ఇండియన్ సినిమా దగ్గర ఫాస్టెస్ట్ 150 మిలియన్ ట్రైలర్ గా ఇది నిలిచింది. ఇక ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కి కీరవాణి సంగీతం అందివ్వగా డీవీవీ దానయ్య నిర్మాణం వహించారు.