RRR : ఓవర్సీస్ లో “RRR” కి మైండ్ బ్లోయింగ్ బుకింగ్స్.!

RRR : పాన్ ఇండియన్ వైడ్ భారీ అంచనాలు నెలకొల్పుకున్నా లేటెస్ట్ భారీ సినిమాల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బిగ్ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ “రౌద్రం రణం రుధిరం” కూడా ఒకటి. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా ఆల్రెడీ సెన్సేషన్ ని నమోదు చేయడం కూడా స్టార్ట్ చేసింది.

ఇప్పటికే ఓవర్సీస్ లో ఈ సినిమాకి బుకింగ్స్ ఓపెన్ కాగా.. ఇంకా సినిమా రిలీజ్ కి చాలా టైం ఉన్నా ఆల్రెడీ హాఫ్ మిలియన్ డాలర్స్ మార్క్ దాటేసి ఇప్పుడు 6 లక్షల డాలర్స్ కి పైగా మార్క్ ని క్రాస్ చేసినట్టు తెలుస్తుంది. ఇంకా ఇంత గ్యాప్ ఉండగానే “RRR” హవా ఇలా ఉంటే ఇక సినిమా రిలీజ్ కి ఒక రెండు రోజుల్లో బుకింగ్ ఏ రేంజ్ లో ఉంటాయో మనం అర్ధం చేసుకోవచ్చు.

ఇక ఈ భారీ సినిమాలో అలియా భట్, అజయ్ దేవగణ్ తదితరులు నటించగా వచ్చే ఏడాది జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ సినిమా రిలీజ్ కానుంది.