కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి తాజాగా రాష్ట్రంలో జరుగుతున్న నేరాల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలే కాదని, పసిపిల్లలు కూడా సురక్షితంగా లేరని వాపోయారు. బంగారు తెలంగాణ లో రక్షణ లేకుండా పోయింది అంటూ విమర్శించారు.
రాష్ట్రంలో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాలు జరిగినట్లు పోలీసు నివేదికలు చెబుతున్నాయని.. ఆ బాధితులకు ఎటువంటి న్యాయం చేస్తారు అని ప్రశ్నించారు. ఇక జూబ్లీహిల్స్ అత్యాచార ఘటన వీడియో బయట పెట్టిన భాజపా ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా నేరస్థుడే అని అన్నారు. కాబట్టి అతనిని కూడా అదుపులో తీసుకొని దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు.