Ram Charan- Upasana: మరదలి పెళ్లిలో రచ్చ చేసిన రామ్ చరణ్ ఉపాసన దంపతులు.. వీడియో వైరల్!

Ram Charan- Upasana: మెగా కోడలు ఉపాసన కొణిదెల సోదరి అనుష్పల కామినేని వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. గత వారం రోజులు క్రిందట ఈమె పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యి ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ క్రమంలోనే ఈ పెళ్లి వేడుకలో మెగా కుటుంబం పాల్గొని ఎంతో ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా అనుష్పల పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఈమె ప్రముఖ కార్ రేసర్ అర్మాన్ ఇబ్రహీంను ప్రేమించింది. ఈ క్రమంలోనే వీరి ప్రేమ విషయాన్ని అనుష్పల పెద్దలకు చెప్పి వారిని ఒప్పించి ప్రేమ వివాహం చేసుకుంది.

కామినేని కుటుంబంలో ఘనంగా వివాహ వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో ఈ వివాహ కార్యక్రమాలకు మెగా కుటుంబ సభ్యులు హాజరయ్యారు. దోమకొండ గడికోటలో జరిగిన పోచమ్మపండుగ సంగీతం మెహందీ వంటి కార్యక్రమాలలో రామ్ చరణ్ దంపతులతో పాటు మెగాస్టార్ చిరంజీవి దంపతులు కూడా పాల్గొన్నారు.ఇక ఈ పెళ్లి వేడుకలో భాగంగా మెగా వారసుడు రామ్ చరణ్ తన భార్య ఉపాసన మరదలితో కలిసి అద్భుతమైన ఇరగదీశాడు.

మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ సాచెత్ తాండన్, పరంపరా ఠాకూర్‌లు పాట పాడుతుంటే ఈ ముగ్గురు ఎంతో అద్భుతంగా ఈ పాటకు డాన్స్ వేశారు.ఇందుకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది మెగా అభిమానులు రామ్ చరణ్ దంపతులను చూసి ఎంతో సంతోష పడుతున్నారు. ఇక తన సోదరి వివాహంలో ఉపాసన రామ్ చరణ్ దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.