RRR : రాజమౌళి “RRR” కి మామూలు ప్రమోషన్స్ తో స్టార్ చెయ్యలేదుగా..!

RRR : తన సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాలి అంటే ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి టాప్ దర్శకుల్లో మన తెలుగు దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళికి మరో దర్శకుడు సాటి రారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పి తీరాలి. తన సినిమాల స్ట్రాటజీ నే వేరే లెవెల్లో ఉంటుంది.
అంతే కాకుండా ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్ కి తగ్గట్టుగా తన సినిమాల ప్రమోషన్స్ ని మార్చివేసే రాజమౌళి ఇప్పుడు తాను తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా సినిమా ట్రిపుల్ ఆర్(RRR) కి అదే చేస్తున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో తీసిన ఈ ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ చిత్రం కి కూడా నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్ ని రాజమౌళి ప్లాన్ చేసాడు.
మరి కరోనా అడ్డుకట్ట వేయగా మళ్ళీ ఫైనల్ గా ఈ భారీ సినిమా రిలీజ్ కి సిద్ధం అవుతుండడంతో ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసేసారు. అందులో భాగంగానే లేటెస్ట్ గా అయితే ప్రముఖ మొబైల్ యాప్ స్నాప్ చాట్ లో తమ సినిమా స్పెషల్ ఫిల్టర్ ని కూడా తెచ్చేసారు.
దీనిపై మేకర్స్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ మీరెవరూ ఆ యాప్ వాడట్లేదా అని పెట్టగా దానిలో ఈ సినిమా ఫిల్టర్ స్క్రీన్ షాట్స్ సమాధానంగా కనిపిస్తున్నాయి. మొత్తానికి అయితే రాజమౌళి మళ్ళీ ఓ రేంజ్ లో తన సినిమాకి ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసేసాడు అని చెప్పాలి. మరి రానున్న మార్చ్ 25 లోపు ఇంకా ఎలాంటి ప్రమోషన్స్ ని చేస్తారో చూడాలి.
https://twitter.com/RRRMovie/status/1498479886612135938