“రాధే శ్యామ్” కోసం నిద్ర లేని రాత్రులెన్నో..కానీ ఫైనల్ గా

పాన్ ఇండియన్ సూపర్ స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రాల్లో ఆల్రెడీ కంప్లీట్ అయ్యి రిలీజ్ కి కూడా రెడీగా ఉన్న చిత్రం “రాధే శ్యామ్”. దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించిన ఈ భారీ చిత్రం నుంచి ఇక మ్యూజిక్ పరంగా అప్డేట్స్ ఇవ్వనుంది. అయితే ఈ చిత్రం సంగీతానికి గాను ముగ్గరు పని చేసారు. సౌత్ ఆల్బమ్ కి ఒకరు అలాగే హిందీ ఆల్బమ్ కి ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ పని చేశారు.

మరి వీరిలో హిందీకి పని చేసిన మనన్ భరద్వాజ్ పెట్టిన ఇంట్రెస్టింగ్ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ సినిమా సంగీతం కోసం ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపామని, ఎన్నో ఎడిటింగ్ లు సంవత్సరాల కొద్దీ ఓపికతో ఈ సినిమా ఆల్బమ్ చేశామని కానీ ఫైనల్ గా ఇప్పుడు సినిమా మ్యూజిక్ ని ప్రెజెంట్ చేసేందుకు టైం దగ్గరకొచ్చింది అని ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని ఇచ్చాడు. ఇక ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ఎప్పుడు వస్తుందో చూడాలి.