Radhe Shyam : పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “రాధే శ్యామ్” ఈ సంక్రాంతి బరిలో రిలీజ్ కి రెడీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఒకవేళ వస్తే ఇదే సంక్రాంతి బరిలో చూడ దగ్గ పెద్ద సినిమా అందులోని బెటర్ సినిమా. ఇక ఇదిలా ఉండగా ఈ ఒక్క పెద్ద సినిమా అయినా రావాలని అంతా కోరుకుంటున్నారు.
మరి ఈ సినిమా వస్తుంది అనే ప్రస్తుతానికి సమాచారం ఉన్నా అభిమానుల్లో మాత్రం అనుమానాలు ఇంకా పోలేదు. దీనితో ఈ సినిమా రిలీజ్ అనుకున్న సమయానికి వస్తుందా లేదా అనే ప్రశ్నకి స్వయంగా దర్శకుడు రాధా కృష్ణనే ఓపెన్ క్లారిటీ ఇవ్వడం జరిగింది.
అభిమానులు అడుగుతున్న ఈ ప్రశ్నకి గాను వాయిదా విషయంలో ఏదైనా అధికారిక అనౌన్సమెంట్ లు ఉంటే డైరెక్ట్ గానే ప్రకటిస్తామని తెలిపాడు. అయితే ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది అంటే ప్రస్తుతం కరోనా ప్రభావం పెరుగుతున్నందున అందరికీ జాగ్రత్తలు చెప్పాడు.
ఇక్కడే అందరికీ చిన్న హింట్ లా రాగ అడిగేసారు. దానితో దర్శకుడు ఈ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం అయితే ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పనులు జరుగుతున్నాయట. చిత్ర బృందం అంతా ఈ పనుల్లో ఇప్పుడు బిజీగా ఉంది.