Pooja Hegde: సినిమాల్లో కన్నా ఇక్కడే బాగున్నావ్ అంటూ.. బుట్టబొమ్మ పై కామెంట్లు చేస్తున్న నెటిజన్లు?

Pooja Hegde: బుట్ట బొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ముద్దుగుమ్మకు ఏ మాత్రం కాళీ సమయం దొరికినా తన వ్యక్తిగత జీవితంలో సంతోషంగా గడపడానికి ప్రయత్నం చేస్తుంటారు.ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం తన సినిమా షూటింగ్ పూర్తికావడంతో అలా మాల్దీవులకు వెళ్లి ఎంతో ఎంజాయ్ చేసింది.మాల్దీవులకు వెళ్లినప్పటి నుంచి అక్కడ వీడియోలను, ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ అభిమానులతో పంచుకున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా పూజా హెగ్డే తన మాల్దీవులకు సంబంధించిన ఒక ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇదిలా ఉండగా తాజాగా ఈ ఫోటో చూసిన ఎంతో మంది నెటిజన్లు దీనిపై బోలెడు కామెంట్లు చేస్తున్నారు. సముద్ర అందాలను ఆస్వాదిస్తూ పూజా హెగ్డే బికినీ ధరించినటువంటి ఫోటోను షేర్ చేయడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ క్రమంలోనే పలువురు నెటిజనులు ఈ ఫోటోపై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఇలా ఒక నెటిజన్ ఈ ఫోటో పై స్పందిస్తూ..మీరు సినిమాలలో కన్నా ఇక్కడే చాలా బాగున్నారు మేడం అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా ప్రభాస్ సరసన నటించిన రాధేశ్యామ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.