Pawan Kalyan: పవన్ చేతికి సెలైన్ …. పవన్ ఆరోగ్యంపై ఫ్యాన్స్ ఆందోళన…. ఆరోగ్యంగా లేరా?

Pawan Kalyan: ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలుస్తుంది. ఇటీవల సింగపూర్ వెళ్లిన ఈయన సింగపూర్ నుంచి తిరిగి రాగానే అనారోగ్యానికి గురయ్యారని తెలుస్తుంది. ఇటీవల జరిగిన క్యాబినెట్ మీటింగ్ కోసం హైదరాబాద్ నుంచి ఈయన సచివాలయానికి వచ్చారు అయితే అందరికంటే ముందుగానే సచివాలయం చేరుకున్న పవన్ కళ్యాణ్ తీవ్రమైన జ్వరంతో బాధ పడ్డారు.

ఇలా తీవ్ర జ్వరంతోనే క్యాబినెట్ మీటింగ్ కి వచ్చిన ఈయనకు పూర్తిగా అస్వస్థత కావడంతో తిరిగి వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇలా అనారోగ్య సమస్యల కారణంగా క్యాబినెట్ మీటింగ్ కి హాజరు కాకపోయినా ఈయన 16వ ఫైనాన్స్ కమీషన్ భేటీ జరిగింది. ఈ భేటీకి పవన్ కళ్యాణ్ హాజరయ్యాడు. కానీ, ఆయన చేతికి సెలైన్ బాటిల్ పెట్టడానికి క్యానీలా వేసినట్టు తెలుస్తుంది ఇలా చేతికి క్యానీలా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఫైనాన్స్ కమిషన్ భేటీకి హాజరయ్యారు.

ఈ విధంగా పవన్ కళ్యాణ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని గ్రహించిన అభిమానులు కంగారు వ్యక్తం చేస్తున్నారు అయితే ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ వరుసగా అస్వస్థతకు గురి అవుతున్న నేపథ్యంలో అభిమానులు సినిమాలు రాజకీయాలు పక్కనపెట్టి మీ ఆరోగ్యం పై దృష్టి పెట్టండి అన్నా అంటూ కామెంట్లు చేస్తున్నారు.పవన్ కళ్యాణ్ కి చిన్నతనం నుండి ‘స్ఫూటం’ అనే లంగ్స్ సంబంధిత వ్యాధి ఉంది. ఇది అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ ని చాలా తీవ్రంగా ఇబ్బంది పెడుతూ వచ్చింది. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ లో ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా తీవ్రంగా దెబ్బతినిందని తెలుస్తోంది.

ఈ క్రమంలో నేను తరచూ అనారోగ్య సమస్యలకు గురి అవుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి పై ఇది సోషల్ మీడియాలో వినిపిస్తున్న ప్రచారం మాత్రమే. పూర్తి స్థాయి వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ఆరోగ్య విషయంలో అభిమానులు కంగారు వ్యక్తం చేస్తున్నారు.