Pawan Kalyan: ఖరీదైన బంగ్లా కొన్న పవన్ కళ్యాణ్..ఎన్ని కోట్లో తెలిస్తే షాక్!

Pawan Kalyan: టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే ఏపీలో జనసేన పార్టీని బలపేతం చేయాలని భావిస్తున్నారు. తాజాగా ఈ హీరో ఓ ఖరీదైన బంగ్లా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. 676 గజాల విస్తీర్ణంలో దాదాపు 12 కోట్ల రూపాయల విలువ గల ఓ బంగ్లాను జూబ్లీహిల్స్‌లో కొనుగోలు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే రిజిస్ట్రేషన్ కూడా జరిగినట్లు సమాచారం.

టాలీవుడ్ సినీ తారలలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న టాప్ మోస్ట్ హీరోలలో పవన్ కల్యాణ్ ఒకరు. ఆయన ఒక సినిమాకు దాదాపు 50 కోట్ల పారితోషికం తీసుకోవడంతో పాటు ఆ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయితే దాంట్లో వాటా కూడా తీసుకుంటున్నారు. ఆయన బంగ్లాకు సంబంధించిన సమాచారాన్ని ఈ మధ్యే ఓ వెబ్‌సైట్‌ విడుదల చేసింది.

కాగా హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన ప్రదేశాలలో జూబ్లీహిల్స్ కూడా ఒకటి. ఈ ఏరియాలో గజం లక్షన్నర నుంచి 2 లక్షల వరకు పలుకుతుందని తెలుస్తోంది. చాలా మంది సెలబ్రిటీలు ఈ ఏరియాలో ఇండిపెండెంట్ హౌస్ కొనేందుకు ఆసక్తి చూపడం గమనార్హం. మరోవైపు పవన్ కల్యాణ్ నటిస్తున్న బీమ్లా నాయక్, హరిహర వీరమల్లు సినిమాలు వచ్చే ఏడాదిలో విడుదల కానుండగా, హరిహర వీరమల్లు సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుండడమే కాకుండా ఈ చిత్రానికి రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతున్నట్టు తెలుస్తోంది.