Nagarjuna: మరోసారి సమంత నాగచైతన్య విడాకులు పై స్పందించిన నాగార్జున.. చెత్త వార్తలు అంటూ అసహనం!

Nagarjuna: టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అక్కినేని నాగచైతన్య సమంత జంటగా విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించిన విషయం మనకు తెలిసిందే.అయితే ఇలా వీరిద్దరు అధికారికంగా విడాకుల గురించి ప్రకటించిన తర్వాత నాగార్జున కుటుంబం పెద్దగా ఈ విషయంపై స్పందించలేదు.విడాకుల ప్రకటన అనంతరం నాగార్జున వీరి విడాకులపై స్పందిస్తూ ఇది వారి నిర్ణయం వారు బాగా ఆలోచించి తీసుకున్నారు వారు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని తెలిపారు.

ఇదిలా ఉండగా తాజాగా నాగార్జున వీరి విడాకుల విషయం పై మరొకసారి స్పందిస్తూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నాగచైతన్య సమంత విడాకులు తీసుకున్నట్లు ప్రకటించగానే ఈ విడాకులకు గల కారణాలు గురించి పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. సమంత నాగచైతన్య విడిపోవడానికి గల కారణం సమంత నటించిన ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ అని వార్తలు షికార్లు చేయగా… సమంతకు తల్లి కావడం ఇష్టం లేదని, సమంత సినిమాలలో నటించడం అక్కినేని కుటుంబానికి ఇష్టం లేదు అంటూ ఏవేవో వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన నాగార్జున అసహనం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే నాగార్జున ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ ఈ విషయం గురించి చర్చించారు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ రోజురోజుకు ఇలాంటి చెత్త వార్తలు స్ప్రెడ్ అవడం ఎక్కువ అవుతుంది. ఈ క్రమంలోనే సమంత నాగచైతన్య విడాకులపై లేనిపోని పుకార్లు పుట్టిస్తున్నారు. అలాంటివి వారి మధ్య ఏమీ లేవని విడాకులు వారిద్దరూ కలిసి తీసుకున్న నిర్ణయమని కావాలనే ఇలాంటి చెత్త వార్తలను ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి వార్తలను మేము కానీ, మా కుటుంబ సభ్యులు కానీ పట్టించుకోవడంలేదని నాగార్జున మరోసారి వీరి విడాకుల గురించి మాట్లాడారు.