Archana: సినిమాలు వస్తూనే ఉన్నాయి. వర్క్ చేస్తూనే ఉన్నాను. ఎప్పుడూ కంప్లీట్‌గా ఖాళీగా లేను. కానీ పెద్ద పెద్ద హిట్స్ అనేవి కొంచెం ఆగాయని ప్రముఖ నటి అర్చన అన్నారు. ఈ మొత్త ప్రక్రియలో ఆ టైంలో టెలివిజన్‌లో చేశానని ఆమె చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే ఆట అనే షోకి జడ్జ్‌గా చేశానని, అది చాలా పెద్ద హిట్ కూడా అయిందని ఆమె చెప్పారు. ఆ సమయంలో కూడా చాలా చిన్నదానివి, ఇప్పుడు జడ్జ్‌గా వెళ్లడం ఏంటీ అని చాలా మంది తనతో అన్నారని అర్చన తెలిపారు. కానీ తన ఉద్దేశమేమిటంటే, వచ్చిన వాటిలో మంచిది ఎంపిక చేసుకొని వెళ్లాలని ఆమె స్పష్టం చేశారు.
ఇకపోతే నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా వల్ల తన కెరీర్‌కి కొంచెం డామేజ్ అయితే అయింది. కానీ అలా పని చేస్తూ పోవాలి ఇంకా అని అనుకున్నట్టు అర్చన అన్నారు. దానికి టెలివిజన్‌లో చేయడం కూడా కారణం అయిండొచ్చు. కానీ అలా వెయిట్ చేస్తూ ఖాళీగా కూర్చోలేం కదా అని ఆమె చెప్పారు.
తాను ఇండస్ట్రీకి వచ్చినపుడు నువ్వు పెద్ద హీరోయిన్ కావాలి, సినిమాల్లో లీడ్ రోల్స్ చేయాలి అని ఇలా చాలా మంది అనేవారు అని అర్చన అన్నారు. కానీ ఇలా అయింది అని, ఎంపిక చేసుకున్న మేనేజర్ కూడా వాళ్ల దగ్గరికి వెళ్లి మన తెలుగమ్మాయి అని ఇలా తన గురించి చెప్పడం కూడా జరగలేదని ఆమె చెప్పారు. తను ఒకపుడు అవకాశాలేవీ రాలేదని, ఆ సమయంలో వచ్చిన అవకాశాలను, ఛాన్స్‌లను ఉపయోగించుకున్నానని ఆమె అన్నారు. అప్పుడు అవన్నీ చూస్తుంటే చాలా బాధేసేదని, కానీ ఇప్పుడు తలచుకుంటే మాత్రం ఆ బాధ కూడా లేదని ఆమె చెప్పారు. అంటే స్థిరంగా ఉండిపోయే స్థితికి వచ్చేశానని, అయితే అయింది.. అయితే ఏంటీ అన్నట్టు ఇప్పుడు తనకు అనిపిస్తూ ఉంటుందని ఆమె వివరించారు.