Rajamouli : రాజమౌళి టార్చర్ చేసేసాడు..మీడియాతో ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్!

Rajamouli : నిన్ననే భారతదేశ వ్యాప్తంగా కూడా ఎనలేని అంచనాలు నెలకొల్పుకున్నా భారీ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) నుంచి బిగ్గెస్ట్ మాస్ ట్రైలర్ కట్ ని చిత్ర బృందం రిలీజ్ చెయ్యగా దానికి భారీ రెస్పాన్స్ వచ్చి ఇపుడు ఇదే కొనసాగుతుంది. అయితే ఈ ట్రైలర్ ని ముందు నిన్న యూట్యూబ్ లో కంటే ముందుగానే థియేటర్స్ లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ లాంచ్ ని మొదటగా ముంబైలో జరిపారు.

దీనికి గాను రాజమౌళితో పాటు ఎన్టీఆర్, అలియా భట్, అజయ్ దేవగన్ లు వచ్చారు. ఈ సందర్భాన అక్కడి మీడియా వారు అడిగిన ఓ ప్రశ్నకి ఎన్టీఆర్ షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు. నాటు నాటు స్టెప్ ఎలా నేర్చుకున్నారో చెప్పే సమయంలో అది చాలా సింపుల్ స్టెప్ కానీ రాజమౌళి పర్ఫెక్ట్ గా రావాలని ఏకంగా 18 టేకులు చేపించి టార్చర్ పెట్టాడని ఎన్టీఆర్ నవ్వుతూ ఈ విషయాన్ని చెప్పాడు. అయితే ఈ స్టెప్ కి ఎంత రెస్పాన్స్ అన్ని వర్గాల నుంచి వచ్చిందో తెలిసిందే.