Ram charan: నా గురించి నీ కన్నా ఎవరికి ఎక్కువ తెలియదు అమ్మా…. చరణ్ ఎమోషనల్ పోస్ట్!

Ram charan: అమ్మ అంటే అందరికి అపురూపమే…ఇంత పెద్దవాళ్ళైనా చిన్న బాధ కలిగిన గుర్తొచ్చే మొదటి వ్యక్తి అమ్మే. పేదవాడైనా, గొప్పవడైనా అమ్మ ప్రేమ మాత్రం ఒక్కటే అమ్మ ప్రేమ దగ్గర సాధారణ వ్యక్తి అయినా సెలబ్రిటీ అయినా ఒకటే. ఇక మన హీరోలు ఇందుకు మినహాయింపు కాదు. అల్లు రామలింగయ్య కూతురు మెగా స్టార్ చిరంజీవి భార్య సురేఖ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లేటెస్ట్ గా రామ్ చరణ్ తన తల్లి పుట్టినరోజు నాడు పెట్టిన పోస్ట్ అందరిని ఆకట్టుకుంది.

”నీకు తెలిసినంతగా నా గురించి ఎవరికీ తెలియదు” హ్యాపీ బర్త్ డే అమ్మ….అంటూ పెట్టిన ఎమోషనల్ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయింది. ఇక ఆచార్య ఫిల్మ్ సెట్స్ లో చిరంజీవి, సురేఖతో తీసుకున్న ఫోటో ను రామ్ చరణ్ షేర్ చేసారు. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయి 33k వ్యూస్ సాధించింది ఇంకా ఈ నెంబర్ పెరుగుతోంది.
ఇక రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని కూడా తన అత్తగారికి విష్ చేసిన పోస్ట్ వైరల్ అయింది. ఉపాసన తన పోస్ట్ లో ఇలా రాసారు.. “ వెరీ వెరీ హ్యాపీ బర్త్ డే అత్తమ్మ… యు ఆర్ ది కోర్ అఫ్ అవర్ మ్యారేడ్ లైఫ్ “ఇలా ఉపాసన తన అత్తగారితో ఉండే అనుబంధాన్ని చెప్పుకున్నారు.

ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం చెర్రీ RRR ప్రొమోషన్స్ తో బిజీగా ఉంటూ, తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ చేసారు. రామ్ చరణ్ బర్త్ డే రోజున కొత్త ఫిలిమ్స్ కి సంబంధించిన వివరాలు తెలియజేయనున్నారు. ఇక ఈయన నటించిన RRRసినిమా వచ్చే నెల 25వ తేదీ విడుదల కానుంది అలాగే ఆచార్య సినిమా కూడా త్వరలోనే విడుదల కానుంది ఇలా రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండగా మరో మూడు ప్రాజెక్టులను చరణ్ లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది.