ఈసారి పక్కా.. నరేంద్ర మోడీ సెంచరీ కొట్టించేలా వున్నారహో.!

Modi to increase Petrol Charges

పెట్రో ధరల విషయమై ప్రతిపక్షంలో వున్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఇంకో మాట.. రాజకీయ పార్టీలన్నటిదీ ఇదే దారి. కాంగ్రెస్ హయాంలో పెట్రో ధరలు పెరిగిన ప్రతిసారీ బీజేపీ యాగీ చేసింది. దేశానికి దోచుకుంటున్నారనీ, దేశ ప్రజల్ని జలగల్లా పీడిస్తున్నారనీ కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తి పోసేది బీజేపీ. కానీ, ఇప్పుడు బీజేపీ హయాంలో జరుగుతున్నదేంటి.? 90 రూపాయలు దాటేసింది లీటర్ పెట్రోలు ధర. అదే సమయంలో అంతర్జతీయంగా ముడి చమురు ధరలు.. మరీ, రికార్డు స్థాయిలో ఏమీ పెరిగిపోలేదు. ఆ మాటకొస్తే, కాంగ్రెస్ హయాంలో పెరిగిన ముడి చమురు ధరల్లో ఇప్పుడు సగం కూడా లేని పరిస్థితి.

Modi to increase Petrol Charges
Modi to increase Petrol Charges

అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు.. కలిసి కట్టుగా పన్నుల వాతతో సామాన్యుడికి పెట్రోలు ‘అందని అత్యవసర వస్తువు’గా మార్చేస్తున్నాయన్నది నిర్వివాదాంశం. ‘రాష్ట్రాలు పెట్రోలుపై పన్నుల్ని తగ్గించుకోవాలి..’ అని కేంద్రం చెబుతోంటే, కేంద్రమే ఆ పని చేయాలన్నది రాష్ట్రాల వాదన. ఈ గొడవ ఎందుకు.? పెట్రోల్, డీజిల్ వంటివాటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చెయ్యచ్చుగా.. అన్నది సామాన్యుల వాదన. కానీ, దానికీ రాష్ట్రాలు అంగీకరించడంలేదు.. కేంద్రమూ సుముఖంగా లేదు. గతంలో పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. అంతర్జతీయ స్థాయిలో ముడి చమురు ధరలతో సంబంధం లేకుండా, దేశంలో పెట్రో ధరలు అతి త్వరలోనే సెంచరీ కొట్టేసేలా వుంది. ఆ రికార్డు కోసం గతంలోనే చాలా ఉత్సాహంగా ఎదురుచూసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ఈసారి మరింత వడివడిగా అడుగులేస్తున్నాయి. కరోనా నేపథ్యంలో సామన్యుడి బతుకు గందరగోళంగా తయారైతే, గోరు చుట్టు మీద రోకలి పోటు.. అన్న చందాన, పెట్రో ధరల పెరుగుదల భారంగా తయారవుతోంది.

పెట్రో ధరలంటే, పెట్రోల్ అలాగే డీజిల్ ధరలు మాత్రమే కాదు.. మొత్తం రవాణా రంగంపై ఈ భారం చాలా తీవ్రంగా వుంటుంది. తద్వారా నిత్యావసర వస్తువల ధరలు అదుపు తప్పుతున్నాయి. గతంలో విపక్షాలు పెట్రో ధరలపై ఉద్యమాలు చేసేవి.. కానీ, ఇప్పుడు అలాంటివి ఆశించలేం.. ఎందుకంటే, విపక్షాలకు సొంత ఎజెండాల మీద శ్రద్ధ.. ప్రజా సమస్యలపై లేకపోవడమే. అదే అధికార పార్టీలకు అడ్వాంటేజ్‌గా మారుతోంది.