ఈ ఏడాది నందమూరి హీరోలకు బాగా కలిసి వచ్చినట్టు ఉంది. అందుకే కరోనా తర్వాత బాలకృష్ణ నటించిన అఖండ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అదేవిధంగా ఈ ఏడాది మొదట్లో ఎన్టీఆర్ నటించిన త్రిబుల్ ఆర్ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై అద్భుతమైన ఆదరణ సంపాదించుకుంది.తాజాగా ఆగస్టు 5వ తేదీ నటుడు కళ్యాణ్ రామ్ నటించిన బింబిసారా సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుంది.ఇలా నందమూరి హీరోలు నటించిన ఈ మూడు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ కావడంతో నందమూరి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే బాలకృష్ణ నటించిన అఖండ, ఎన్టీఆర్ నటించిన త్రిబుల్ ఆర్, కళ్యాణ్ రామ్ నటించిన బింబిసారా మూడు సినిమాలలో ఓకే కామన్ పాయింట్ ఉంది. ఈ ముగ్గురు హీరోలు నటించిన ఈ సినిమాలో ఒక పాప సెంటిమెంటుతో తెరకేక్కాయి. ఈ ముగ్గురు సినిమాలలో కూడా చిన్నారి కోసం ఎంతో కష్టపడటమే కాకుండా సినిమా మొత్తం ఆ చిన్నారి కోసమే కథ నడుస్తుంది. ఇలా ఈ మూడు సినిమాలకు పాప సెంటిమెంట్ కలిసి వచ్చిందని చెప్పాలి.
ఇక తాజాగా కళ్యాణ్ రామ్ నటించిన బింబిసారా సినిమాలో చిన్నారి ఎంతో కీలకంగా మారింది. ఇందులో కళ్యాణ్ రామ్ ప్రాణాలు కాపాడి ఆయనను మంచిగా మార్చడమే ప్రధాన ఎలిమెంట్ అని చెప్పాలి. ఈ సినిమాలో పాప సెంటిమెంట్ హైలెట్ కావడమే కాకుండా పాపపై ప్రత్యేకంగా పాట ఉండటం విశేషం.ఇలా మొత్తానికి నందమూరి హీరోలకు పాప సెంటిమెంట్ బాగా కలిసి వచ్చిందని అందుకే ఈ ముగ్గురు కూడా బ్లాక్ బస్టర్ సినిమాలను తమ ఖాతాలు వేసుకున్నారని ఈ విషయం గురించి ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.