“మా” లో కుట్ర..నాగబాబు సంచలన వ్యాఖ్యలు వైరల్.!

ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో “మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్”(మా) ఎన్నికల తో వాతావరణం అంతా ఎంతలా వేడెక్కిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా పోటీ ప్రకాష్ రాజ్ మరియు మంచు విష్ణు ప్యానెల్ నడుమే ఉండడంతో సరికొత్త కోణాలతో అనేక వివాదాలకు దారి తీస్తుంది. లోకల్ నాన్ లోకల్ అనే నినాదంతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు కంప్లీట్ పాలిటిక్స్ లాగ కుట్రలు జరుగుతున్నాయి అనే దాని వరకు వెళ్ళింది.

తాజాగా మెగా బ్రదర్ నాగబాబు కొణిదెల చేసిన సంచలన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు మా ఎన్నికల్లో ఆర్టిస్ట్ ల ఓట్స్ కోసం డబ్బు పంచడం అనేది జరగలేదని ఒక్కో ఓట్ కి విష్ణు వాళ్ళు పది వేలు పంచినట్టుగా నాకు వినిపించింది అని కామెంట్ చేశారు.

ఇది వరకు మా మసకబారుతుంది అని అన్నాను కానీ ఇప్పుడు ఇలాంటివి జరిగితే నిజంగానే మసకబారబోతుంది అని మంచు విష్ణు పై అసహనం వ్యక్తం చేసి ఇదంతా కుట్ర పూరితంగా జరుగుతుంది అని అసహనం వ్యక్తం చేశారు. సినిమా ఓట్స్ కోసం కూడా డబ్బులు పంచడం అనేది ఏదైతే ఉందో.. ఇది నెవర్ బెఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే చెప్పాలి ఇక.