Stalin Re Release: స్టాలిన్ రీ రిలీజ్.. స్పందించిన మెగాస్టార్… ఇది ఎంతో ప్రత్యేకం అంటూ!

Stalin Re Release: ఇటీవల కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ సినిమాలో ట్రెండు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇలా ఎన్నో సినిమాలు ఇప్పటికే తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇకపోతే త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన స్టాలిన్ సినిమా కూడా తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా నిర్వహిస్తున్నారు. ఈ సినిమాని మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22వ తేదీ విడుదల చేయబోతున్నారు.

ఈ క్రమంలోనే చిరంజీవి ఈ సినిమా రీ రిలీజ్ గురించి మాట్లాడుతూ ఒక వీడియోని విడుదల చేశారు ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. ఇందులో భాగంగ చిరంజీవి మాట్లాడుతూ..”అందరికీ నమస్కారం.. స్టాలిన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు అవుతోంది. మళ్లీ ఇన్ని సంవత్సరాలకు నా పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాని తిరిగి విడుదల చేయడానికి నిర్మాతలు అలాగే నా తమ్ముడు నాగబాబు సర్వం సిద్ధం చేశారు. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. ఒక మంచి సందేశాన్ని సమాజానికి అందించింది” అంటూ చిరంజీవి ఈ సినిమా రీ రిలీజ్ పై చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

 https://twitter.com/Anjana_Prod/status/1956696349539201394?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1956696349539201394%7Ctwgr%5E909e03f35645517b4ce49ae7622af42f1446b6c2%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F

ఇక ఈ సినిమాలో చిరంజీవి త్రిష ప్రధాన పాత్రలలో నటించగా కుష్బూ చిరంజీవి అక్క పాత్రలో నటించారు ఇక ప్రకాష్ రాజకీయ నాయకుడిగా ఈ సినిమాలో సందడి చేశారు. 2006వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది దాదాపు 19 సంవత్సరాలు తర్వాత తిరిగి ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రేక్షకులు కూడా ఈ సినిమాని థియేటర్లో మరోసారి చూడటం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో కలిసిన నటించిన చిరంజీవి త్రిష దాదాపు 19 సంవత్సరాల తర్వాత తిరిగి విశ్వంభర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.