నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ ఊపు తెచ్చిందిగానీ.!

Naga Chaitanya Love Story Made Much Sound | Telugu Rajyam

అహహా.. ఎన్నాళ్ళ తర్వాత ఈ సందడి.? అడ్వాన్స్ బుకింగుల జోరు చూసి ఎన్నాళ్ళయ్యింది.? సినీ పరిశ్రమలో జరుగుతున్న చర్చ ఇది. ఔను, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా రూపొందిన ‘లవ్ స్టోరీ’ సినిమా అనూహ్యమైన రీతిలో అంచనాల్ని పెంచేసుకుంది. మరి, సినిమా ఆ అంచనాల్ని అందుకుందా.? అంటే, ఆ సంగతి తర్వాత.. విడుదలకు ముందు మాత్రం సినిమాపై విపరీతమైన హైప్ క్రియేట్ అవడమే కాదు, తొలి రోజు ఓపెనింగ్స్ అదిరిపోయాయి. దాదాపుగా అన్ని థియేటర్ల వద్దా పండగ వాతావరణం కనిపించింది. కరోనా పాండమిక్ నేపథ్యంలో సినిమా థియేటర్ల వద్ద నెలకొన్న నైరాశ్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

‘లవ్ స్టోరీ’ కంటే ముందు కొన్ని చెప్పుకోదగ్గ సినిమాలు పాండమిక్ నేపథ్యంలో విడుదలైనా, అవేవీ ఈ స్థాయిలో విడుదలకు ముందు, విడుదల సమయంలో సందడి చేయలేకపోయాయి. ఇంతకీ, ‘లవ్ స్టోరీ’ సినిమా రేపు, ఎల్లుండి, ఆ తర్వాతి రోజు నిలబడుతుందా.? ప్రేక్షకుల్ని థియేటర్లకు రాబడుతుందా.? అంటే, రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయన్నది ట్రేడ్ పండితుల వాదన. ఈ తరహా సినిమాలకి యూత్ ఆడియన్స్ మెయిన్ టార్గెట్. వాళ్ళకు నచ్చే ఎలిమెంట్స్ ‘లవ్ స్టోరీ’ సినిమాలో బాగానే వున్నాయి. శేఖర్ కమ్ములకు వున్న బ్రాండ్ ఇమేజ్.. యూత్ ఆడియన్స్‌కి బాగా వర్కవుట్ అవుతుంది కూడా. అయితే, స్లో నెరేషన్ అనేది కొంత ఇబ్బందికరంగా మారిందంటున్నారు. అయితే, ప్రేక్షకులు సినిమాకి కనెక్ట్ అవడాన్ని బట్టి, ‘లవ్ స్టోరీ’ రేంజ్ ఆధార పడి వుంటుందన్నది నిర్వివాదాంశం. ప్రస్తుతానికైతే ‘లవ్ స్టోరీ’ మంచి టాక్ దక్కించుకుంది.. హిట్టు.. అనే ముద్ర ఆల్రెడీ వేయించేసుకుంది.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles