Ram Charan: నాన్న నాకు యాక్టింగ్.. డాన్స్ నేర్పలేదు.. క్రమశిక్షణ మాత్రమే నేర్పారు.. రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్!

Ram Charan: టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన.మెగా కుటుంబం నుంచి వచ్చిన తన నటనా నైపుణ్యంతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలలో నటించే స్థాయికి ఎదిగారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ నటించిన RRR సినిమా జనవరి 7వ తేదీ విడుదల కావాల్సి ఉండగా కరోనా ప్రభావం వల్ల వాయిదా పడింది. అయితే ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు ఆశిష్ రెడ్డి హీరోగా రౌడీ బాయ్స్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా మ్యూజికల్ ఈవెంట్స్ ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు రామ్ చరణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ ఈ వేదికపై మాట్లాడుతూ.. ఇండస్ట్రీలోనే కాదు …మనం ఏ రంగంలోనైనా ముందుకు రావాలంటే ప్రతిభ ఒక్కటే ముఖ్యం కాదు క్రమశిక్షణ కూడా ఎంతో ముఖ్యమని తెలిపారు నాకు మా నాన్న యాక్టింగ్..డాన్స్ చేయడం నేర్పలేదని క్రమశిక్షణ మాత్రమే నేర్పించారని ఈ సందర్భంగా రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఇక రౌడీ బాయ్స్ చిత్రం గురించి మాట్లాడుతూ సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వస్తున్న ఆశిష్ నటనలో తప్పకుండా విజయం సాధిస్తారని,ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ఎంతో అద్భుతంగా ఉందని తెలిపారు. ఈసారి సంక్రాంతి తప్పకుండా రౌడీ బాయ్స్ దేనని ఈ సందర్భంగా రామ్ చరణ్ ఆశిష్ రెడ్డి గురించి తన రౌడీ బాయ్స్ చిత్రం గురించి మాట్లాడారు. ఇక హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి మాట్లాడుతూ ఎంతో క్యూట్ గా డాన్స్ చేసిందని తెలిపారు. ఈ క్రమంలోనే ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని చిత్ర బృందానికి రామ్ చరణ్ అల్ ది బెస్ట్ తెలియజేశారు.