Mohan Babu: మోహన్ బాబు అంటే వణికిపోతారు.. ఆయన దెబ్బకి హెల్త్ పాడయ్యింది…. ఎం.వి.రఘు షాకింగ్ కామెంట్స్!

Mohan Babu: మోహన్ బాబుకు, తనకు విబేధాలున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజమూ లేదని సినిమాటోగ్రాఫర్ ఎంవీ రఘు తెలిపారు. తానే ఆ కాంపోండ్‌లోకి వెళ్లొద్దని 6 సినిమాలు తీశాక ఆ నిర్ణయం తీసుకున్నానని ఆయన చెప్పారు. ఎందుకంటే ఆయనతో ఎప్పుడూ ఒక అగ్నిపర్వతంలా ఉంటుందని ఆయన అన్నారు. అదెలా ఉంటుందంటే తాను తప్పు చేసినా, తన పక్కనున్న వాడు తప్పు చేసినా చుట్టు పక్కల వాతావరణం మొత్తం మారిపోతుందని ఆయన అన్నారు. దాని వల్ల తాను కొన్ని అనారోగ్య సమస్యలు కూడా ఎదుర్కొన్నానని ఆయన తెలిపారు. తనకు ఆయన వస్తున్నడగానే టిఫిన్ కూడా తినకుండా పక్కన పెట్టేసి, మళ్లీ మళ్లీ కాఫీ తాగేవాడినని ఆయన అన్నారు.

ఇకపోతే తనను మోహన్ బాబు, కృష్ణ కంటే బాగా చూశారని, అందులో మాత్రం ఆయన చాలా గొప్ప వ్యక్తిగా తాను అభివర్ణిస్తానని ఆయన అన్నారు. ఆయనతో 6 సినిమాలు తీశానన్న ఆయన, అలా ఆయన్తో 6వ సినిమాకు వచ్చేసరికి తన టెన్షన్ స్థాయి తీవ్రంగా పెరిగిపోయాయని ఆయన చెప్పారు. అప్పుడు తనకనిపించింది ఎందుకు అవసరమా? అని అనిపించిందని, ఇంట్లో వాళ్లు కూడా ఎందుకింత టెన్షన్, అనారోగ్య సమస్యలు అని అనేవారని ఆయన తెలిపారు. అంతే గానీ డైరెక్టుగా తనకూ, ఆయనకూ మధ్య ఎలాంటి గొడవలూ జరగలేదని ఆయన చెప్పారు.

కానీ ఒక్కటి మాత్రం తనకు గుర్తున్న సన్నివేశం ఉందని ఆయన ఇలా చెప్పుకొచ్చారు. మోహన్ బాబుతో ఒక సినిమా చేస్తున్నపుడు అందరితో సమానంగా కాకుండా తనకు ఒక గెస్ట్‌ హౌస్‌లో ఇచ్చారన్న రఘు, అదే విషయాన్ని ఆయన్ని అడిగితే, “అదేంటయ్యా నువ్వు ఏది కావాలంటే అది ఇవ్వను. నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తున్నావేంటీ ” అని అన్నారని ఆయన తెలిపారు. ఆ ఒక్క ఇన్సిడెంటే జరిగింది తప్ప తమ మధ్య ఇంకేం జరిగలేదని ఆయన వెల్లడించారు. ఒకవేళ దాన్ని చూసి బయట ఆయనకూ, తనకూ ఏమైనా తగాదాలున్నాయని అనుకుంటున్నారేమో అని ఆయన సందేహం వ్యక్తం చేశారు.