Acharya Trailer : మెగాస్టార్ “ఆచార్య” ట్రైలర్ రిలీజ్ కి వేరే అదిరే ప్లాన్స్ ఉన్నాయా?

Acharya Trailer : ఇండియన్ సినిమా లెజెండరీ హీరో మెగాస్టార్ హీరోగా మెగా వారసుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్న మెగా మల్టీ స్టారర్ చిత్రం “ఆచార్య”. బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా కోసం ఆడియెన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా మాసివ్ ట్రైలర్ పై నిన్ననే బిగ్గెస్ట్ అప్డేట్ కూడా రివీల్ చేశారు.
మరి ఇప్పుడు ఈ ట్రైలర్ రిలీజ్ పై ఇంకో ప్లానింగ్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. బహుశా ఈ ట్రైలర్ ని థియేటర్స్ లో కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.
అలాగే మరో టాక్ అయితే మోస్ట్ అవైటెడ్ భారీ సినిమా “కేజీయఫ్ చాప్టర్ 2” థియేట్రికల్ ప్రింట్ తో అటాచ్ చేసే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది.
మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి సంగీతం అందివ్వగా మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సరసన డస్కీ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.
అలాగే మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించిన ఈ సినిమా ఈ ఏప్రిల్ 29న విడుదుల కాబోతుంది.