Mohan Babu: మోహన్ బాబుది క్రమశిక్షణ కాదు.. అతి క్రమశిక్షణ..కమెడియన్ షాకింగ్ కామెంట్స్!

Mohan Babu: మామూలుగానే మోహన్ బాబు గారిని చూస్తే అందరూ భయపడతారని, దానికి తోడు ఆయనది మామూలు క్రమ శిక్షణ కాదు.. అతి క్రమశిక్షణ అని నటుడు మానవ కోటేశ్వర రావు అన్నారు. ఆయనకు కావల్సిన దాని కన్నా ఎక్కువ అంటే ఓవర్ డిసిప్లెన్ ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఆయనతో కలిసి నటించానని, అంతకు ముందు కూడా మోహన్ బాబు తనకు తెలుసని ఆయన చెప్పారు. అప్పట్లో తాను ఫుడ్ ప్రాసెసింగ్ చేసే వాడినని, మేజర్ చంద్రకాంత్ సమయంలో తాను సర్వీస్ చేశానని ఆయన అన్నారు. డెమో ఇచ్చి సప్లై చేశానని ఆయన తెలిపారు.

ఇకపోతే శ్రీరాములయ్య సినిమాలో ఆయనతో కలిసి మొదటిసారిగా నటించానని కోటేశ్వర రావు తెలిపారు. అప్పుడు మోహన్ బాబు గుర్తుపట్టి మీరు బిజినెస్‌తో పాటు, యాక్టింగ్ కూడా చేస్తారా అని అన్నారని ఆయన చెప్పారు.

తాను మొదటగా దాసరి గారి ఇన్సిపిరేషన్‌తో డైరెక్షన్‌ ఫీల్డ్‌లోకి అడుగు పెట్టానని కోటేశ్వర రావు తెలిపారు. ఆయన సినిమాలు ఎక్కువగా చూసి, డైలాగులు ఎలా రాయాలి అనేది నేర్చుకున్నానని, తాను ఇప్పటికీ ఆయన అప్పట్లో చేసిన సినిమాలను చూస్తానని ఆయన చెప్పారు. కానీ తాను అనుకున్నది కాలేదని, అప్పట్లో ఒక సబ్జెక్ట్ అనుకొని, సీరియల్ వర్కవుట్ చేస్తే, సీరియల్ కన్నా తన బిజినెసే బాగుందని ఆయన అన్నారు. అందుకే ఇక వద్దని దాన్ని పక్కన పెట్టి బిజినెస్ కంటిన్యూ చేశానని ఆయన వివరించారు.

ఇదిలా ఉండగా కొంత మంది యూత్ ఏదో అనుకొని సినీ ఫీల్డ్‌లోకి వస్తున్నారని, బాగా చదువుకొని ఎలాంటి ముందు చూపులేకుండా ఇండస్ట్రీకి వస్తే చాలా ఇబ్బంది పడతారని కోటేశ్వర రావు అన్నారు. ప్రస్తుతం అవకాశాలతో పాటు పోటీతత్వం కూడా పెరిగిందని, అప్పుడు ఒక క్యారెక్ట్ ఆర్టిస్ట్‌గా ఎంటర్‌ అయితే లైప్‌లాంగ్ సెట్‌ అయిపోవచ్చు అని ఉండేది.. కానీ ఇప్పుడలా లేదని ఆయన స్పష్టం చేశారు.