చరణ్ క్రేజ్ తో చిరు అదిరే ప్లాన్ చేసారా..?

ఇప్పుడు మన టాలీవుడ్ లో నయా జెనరేషన్ స్టార్ హీరోలు పాన్ ఇండియన్ స్థాయి మార్కెట్ ని పెంచుకునే పనిలో ఉన్నారు. వారిలో ప్రభాస్ తర్వాత కాస్త త్వరగా మంచి మార్కెట్ సంపాదించుకునేలా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కనిపిస్తున్నాడు. తాను చేసిన లేటెస్ట్ భారీ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) తో బాలీవుడ్ మార్కెట్ లో కూడా చరణ్ పాగా వెయ్యడం కన్ఫర్మ్ అని అక్కడి వర్గాలు కూడా చెబుతుండడంతో ఇప్పుడు క్రేజ్ ని మెగాస్టార్ పర్ఫెక్ట్ గా వినియోగించే ప్లాన్ చేసినట్టు గాసిప్స్ వినిపిస్తున్నాయి.

చరణ్ కి వచ్చే ఫేమ్ తో తన సినిమా “ఆచార్య” రిలీజ్ స్పాన్ ని కూడా చిరు పెంచే ప్రయత్నం చేశారు. అయితే దీనితో ఒక్క చిరుకి మాత్రమే కాకుండా దర్శకుడు కొరటాలకు కూడా ప్లస్ అవుతుంది అని చెప్పాలి. ఎలాగో చరణ్ తో “ఆచార్య” లో నటింపజేసిన కొరటాల దీని తర్వాత ఎన్టీఆర్ తో సినిమా ఒకటి ప్లాన్ చేశారు. సో ఆచార్య తో కొరటాల పేరు హిందీలో కాస్త ముందే పరిచయం అయితే ఎన్టీఆర్ తో సినిమా రిలీజ్ నాటికి ఏ ఢోకా ఉండదు. అలాగే చిరు తీసుకునే ఈ స్టెప్ తర్వాత తన గాడ్ ఫాదర్ కి కూడా బాగా పనికొస్తుంది అని చెప్పొచ్చు.