Mahesh Babu: మొదటిసారిగా నమ్రత ప్రవర్తనకు హార్ట్ అయిన మహేష్ బాబు… అసలేం జరిగిందంటే?

Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆదర్శ దంపతులుగా ఉన్నటువంటి వారిలో నమ్రత మహేష్ బాబు జంట ఒకటని చెప్పవచ్చు. వీరిద్దరూ వంశీ సినిమా ద్వారా ప్రేమలో పడి పెద్దలకు ఇష్టం లేకపోయినా వారిని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఈ విధంగా పెళ్లి బంధంతో ఒక్కటైన ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటూ జీవితంలో పిల్లలతో కలిసి చాలా సంతోషంగా గడుపుతున్నారు.సాధారణంగా భార్యాభర్తలు అన్న తర్వాత గొడవలు రావడం సర్వసాధారణం అయితే ఆ గొడవలను అక్కడితో మర్చిపోయి తిరిగి ఒకటైపోతే ఎలాంటి సమస్యలు ఉండవు కానీ ఆ సమస్యను సాగదీస్తూ పెద్దదిగా చేస్తేనే సమస్యలు ఎదురవుతాయని అందరికీ తెలిసిన విషయమే.

ఈ విధంగా ఎంతో అందంగా, అన్యోన్యంగా ఉన్న మహేష్ బాబు నమ్రత జంటల మధ్య కూడా ఈ విధమైనటువంటి గొడవలు, అలకలు, బుజ్జగింపులు సర్వ సాధారణంగానే ఉన్నాయని అయితే ఒకానొక సందర్భంలో నమ్రత తనపై చాలా కోపంగా ఉండేదని తనతో మాటలు కూడా మాట్లాడేది కాదని మహేష్ బాబు ఓ సందర్భంలో తెలియజేశారు.పెళ్ళైన మొదట్లో ఎంతో సంతోషంగా ఉన్నామని గౌతమ్ పుట్టిన తర్వాత ఓ విషయం గురించి నమ్రత తనతో మాట్లాడటమే మానేసిందని తెలియజేశారు.ఆమె దగ్గరకు నేను వెళ్తే దూరంగా వెళ్ళడం పిలిచినా పలకకపోవడంతో వంటివి చేయడం వల్ల నేను చాలా హర్ట్ అయ్యానని మహేష్ బాబు తెలియజేశారు.

అయితే ఆ తర్వాత ఇద్దరం ఆ గొడవ గురించి మర్చిపోయి మాట్లాడుకున్నామని అప్పటినుంచి ఇప్పటివరకు మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవ కూడా చోటు చేసుకోలేదని ఈ సందర్భంగా మహేష్ బాబు నమ్రత గురించి తెలియజేశారు.ఇకపోతే మహేష్ బాబు వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న నేపథ్యంలో నమ్రత మాత్రం తన కుటుంబ వ్యవహారాలను పిల్లల చదువులు గురించి పూర్తి బాధితులను తీసుకుంటుందని, పిల్లల విషయాల గురించి తాను ఏమి పట్టించుకోనని ఆ బాధ్యతలన్నీ నమ్రత ఎంతో చక్కగా నిర్వహిస్తుందని తెలియజేశారు.