నాగ్ భారీ సినిమా నుంచి తప్పుకున్న కాజల్..ఆమె ప్లేస్ లో?

Kajal Walked Out From Nagarjuna Big Project | Telugu Rajyam

అక్కినేని కుటుంబంకి మళ్ళీ చాలా కాలం తర్వాత ఈ నయా యుగంలో గోల్డెన్ డేస్ మళ్ళీ తిరిగి వచ్చాయని చెప్పాలి. వరుసగా అక్కినేని హీరోలు హిట్స్ అందుకుంటుండగా కింగ్ నాగ్ సాలిడ్ కం బ్యాక్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే లాస్ట్ “వైల్డ్ డాగ్” హిట్ కాకపోయినా టాలెంటెడ్ దర్శకుడు ప్రవీణ్ సత్తారు తో తీస్తున్న భారీ యాక్షన్ చిత్రం “డెవిల్” పై విపరీతమైన అంచనాలు ఉన్నాయి.

మరి ఈ సినిమాలోనే నాగ్ కి హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ని మేకర్స్ ఫిక్స్ చేశారు. కానీ పలు కారణాల చేత కాజల్ ఈ సినిమా నుంచి బయటకి వచ్చేసిందట. మరి ఈమే స్థానాన్ని ప్రముఖ హీరోయిన్ అమలా పాల్ తో భర్తీ చెయ్యాలని మేకర్స్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. మరి కాజల్ ఎందుకు తప్పుకుందో అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles