Ram Charan and Upasana : రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న రామ్ చరణ్, ఉపాసన- ట్విన్స్‌కు జన్మనివ్వబోతున్న దంపతులు

రామ్ చరణ్, ఉపాసన కామినేని కొణిదెల వారి జీవితంలో మరో అందమైన అధ్యాయాన్ని ఆరంభించారు. ఈ జంట రెండోసారి తల్లిదండ్రులు కానున్నారు. త్వరలో ట్విన్స్‌కు (కవలలు) జన్మనివ్వనున్నారు. ఒక క్యూట్‌ వీడియోను పోస్ట్‌ చేసిన ఉపాసన.. ఈ దీపావళి మా జీవితంలో డబుల్ సెలబ్రేషన్, డబుల్ లవ్, డబుల్ బ్లెసింగ్స్‌తో ఆనందాన్ని రెట్టింపు చేసిందని ఈ గుడ్‌న్యూస్‌ను షేర్‌ చేశారు.

ఉపాసన బేబీ షవర్ వేడుక అద్భుతంగా జరిగింది. ప్రేమ, ఆనందం, కుటుంబ స్నేహం నిండిన ఆ క్షణాలు మెమరబుల్ గా నిలిచాయి. బేబీ షవర్ వేడుక కుటుంబం, స్నేహితులు, సన్నిహిత వాతావరణంలో కన్నుల పండగలా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వరుణ్ తేజ్ వంటి ప్రముఖులు ఈ వేడుకకు హాజరై తమ ఆశీర్వాదాలను అందించారు.

ఉపాసన, రామ్ చరణ్ కూమార్తె క్లిన్ కారా కొణిదెల జూన్ 20, 2023న జన్మించింది. ఇది వారి జీవితాల్లో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఆమె పుట్టినప్పటి నుండి ఈ జంట తల్లిదండ్రుల గురించి, అది వారి బంధాన్ని ఎలా మరింతగా పెంచిందో, వారి జీవితాలకు కొత్త అర్థాన్ని జోడించిందో చెప్పారు.

ఇప్పుడు కవలలు రాబోతున్నందున ఈ జంట తమ కుటుంబంలోకి ఇద్దరు కొత్త సభ్యులను స్వాగతించడానికి ఉత్సాహంగా ఉన్నారు. అభిమానులు కూడా ఈ కొత్త సంతోషాన్ని ఎంతో ఉత్సాహంగా స్వాగతిస్తున్నారు.

MP Kesineni Chinni Vs Kolikapudi Srinivasa Rao | Chandrababu | Telugu Rajyam