తూచ్.! అదంతా ఉత్తదేనా చందమామా.!

పెళ్లయినా ఏమాత్రం క్రేజ్ తగ్గని ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. పెళ్లి తర్వాత పర్సనల్ లైఫ్‌ని ఓ రేంజులో ఎంజాయ్ చేస్తూనే, మరోవైపు కెరీర్‌నీ చక్కగా దిద్దుకుంటోంది. చేతి నిండా సినిమాలతో బిజీగా గడుపుతోంది. టాలీవుడ్‌తో పాటు, కోలీవుడ్, బాలీవుడ్ సినిమాలు కూడా కాజల్ చేతిలో ఉన్నాయంటేనే అర్ధం చేసుకోవచ్చు ఆమె రేంజ్ ఏ స్థాయిలో ఉందో. ఇకపోతే, ఇంత బిజీగా ఉండి కూడా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో షూట్లతో రెచ్చిపోతోంది కాజల్ అగర్వాల్. అప్ కమింగ్ హీరోయిన్లకు కళ్లు కుట్టేలా ఉంటున్నాయి మరి ఆ ఫోటో షూట్లు.

ఇంతకు ముందు కన్నా సోషల్ మీడియాలో చాలా చాలా యాక్టివ్‌గా కనిపిస్తూ, ఫ్యాన్స్‌ని తన అందచందాలతో మెస్మరైజ్ చేస్తోంది. ఇక కాజల్ ప్రజెంట్ ప్రాజెక్టుల విషయానికి వస్తే, మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే కింగ్ నాగార్జునతో ఓ సినిమాలోనూ కాజల్ నటిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకీ కాజల్ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్‌లో మూడు ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయి. అలాగే హిందీలోనూ ఓ సినిమాలో కాజల్ నటిస్తోంది. ఇవన్నీ ఇలా ఉంటే, ఇంకో పక్క కాజల్ ప్రగ్నెన్సీ విషయమై కొన్ని గాలి వార్తలు ఈ మధ్య గుప్పుమంటున్నాయి. అయితే, తూచ్.. అదంతా ఉత్తదేనంటూ తాజాగా మరో ప్రచారం తెరపైకొచ్చింది.