Kajal Agarwal: తల్లి కాబోతున్న వెండితెర చందమామ.. ఫోటోలు వైరల్!

Kajal Agarwal: తేజ దర్శకత్వంలో తెరకెక్కిన లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన కాజల్ అగర్వాల్ ఆ తర్వాత చందమామ సినిమా ద్వారా మరింత గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా ఇండస్ట్రీలోకి వచ్చిన మొదటి సినిమాలతోనే ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ మిత్రవింద వరుస సినిమా అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో గత దశాబ్ద కాలం నుంచి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూనే ఉన్నారు.ఈ క్రమంలోనే గత ఏడాది తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ ను వివాహం చేసుకున్న ఈమె వివాహం తర్వాత కూడా ఆచార్య సినిమా షూటింగులో పాల్గొంది.

ఈ సినిమా పూర్తి కాగానే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న ఘోస్ట్ అనే చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ సినిమా షూటింగ్ లో కొన్ని రోజులు పాల్గొన్న తర్వాత కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్ అనే విషయం తెలియడంతో సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం. గత కొద్దిరోజుల నుంచి కాజల్ అగర్వాల్ తల్లి కాబోతోందని అందుకే సినిమాలకు దూరంగా ఉందనే వార్తలు పెద్దఎత్తున వినిపిస్తున్నప్పటికీ ఈ విషయం గురించి కాజల్ అగర్వాల్ ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన వెల్లడించలేదు.

తాజాగా కాజల్ అగర్వాల్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలలో కాజల్ అగర్వాల్ బేబీ బంప్ ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇలా తన ప్రెగ్నెంట్ అనే విషయాన్ని అధికారికంగా ప్రకటించకపోయినా అభిమానులు శుభాకాంక్షలు తెలియజేయడంతో కాజల్ అగర్వాల్ ఈ విషయాన్ని బయట పెడతారా లేకుంటే రహస్యంగా ఉంచుతారా అనే విషయం తెలియాల్సి ఉంది.