Suma kanakala: క్యాష్ షో లో జబర్దస్త్ కమెడియన్ భార్య శ్రీమంతం.. తల్లిలా అన్ని తానే చేసిన సుమ..!

Suma Kanakala: సుమ యాంకర్ గా వ్యవహరిస్తున్నక్యాష్ ప్రోగ్రాం ఈటీవీ లో గత కొన్ని సంవత్సరాలుగా దిగ్విజయం గా ముందుకు సాగుతోంది. ఈ షో ఇన్ని రోజులు కొనసాగడానికి సుమ యాంకరింగ్ ముఖ్య కారణమని చెప్పవచ్చు. ఈ షోలో పార్టిసిపేట్ చేసే వారితో సినిమా చేసే సందడి అంతా ఇంతా కాదు. సుమ తన కామెడీతో,పంచులతో వచ్చిన వారందరినీ ఒక ఆట ఆడేసుకుంటుంది. ఇదిలా ఉండగా ఇటీవల క్యాష్ ప్రోగ్రాం కి జబర్దస్త్ కమెడియన్ వినోద్ తన భార్యతో కలిసి వచ్చాడు.

వినోద్‌తోపాటు ఇతర జబర్దస్త్ కమెడీయన్లు, పవన్‌, తన్మయి, హరికృష్ణ కూడా పాల్గొన్నారు. హరికృష్ణ కూడా తన భార్యతో పాల్గొనగా, పవన్‌, ట్రాన్స్ జెండర్‌ తన్మయి తమ మదర్స్ తో షోలో పాల్గొన సందడి చేశారు. క్యాష్ ప్రోగ్రాంలో సుమ వినోద్ భార్యకి శ్రీమంతం చేయటం అందరిని భావోద్వేగానికి గురి చేసింది. జబర్దస్త్ కామెడీ షో ద్వారా వినోద్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. చమ్మక్ చంద్ర టీమ్ లో లేడీ గెటప్ లలో దర్శనమిస్తూ తన కామెడీతో అందరిని మెప్పించాడు.

ఇటీవల వినోద్ తన భార్య విజయతో కలిసి క్యాష్ ప్రోగ్రాం లో సందడి చేశారు. అయితే ఈ సందర్భంగా క్యాష్ ప్రోగ్రాం లో సుమ శ్రీమంతం చేసింది. వినోద్ భార్య కి తల్లిదండ్రులు ఎవరూ లేకపోవడంతో ప్రస్తుతం గర్భవతిగా ఉన్న అతనికి తల్లి స్థానంలో నిలబడి సుమ సీమంతం చేసింది. ప్రస్తుతం క్యాష్‌` లేటెస్ట్ ఎపిసోడ్‌ ప్రోమోలోని సన్నివేశాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. క్యాష్ ప్రోగ్రాం లో తన సీమంతం ఘనంగా నిర్వహించినందుకు వినోద్ భార్య కంటతడి పెట్టుకుంది.