Lemongrass: వర్క్ టెన్షన్ వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతోందా..? ఈ టీ ఔషదంలా పని చేస్తుంది..!

Lwmongrass: ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. డబ్బు సంపాదనలో పడి సమయానికి తిండి తినక, నిద్రపోకపోవటం వల్ల ఆరోగ్య సమస్యలు మానసిక ఒత్తిడి పెరుగుతున్నాయి. అయితే పని వత్తిడి వల్ల కలిగే అలసట దూరం చేయటానికి చాలామంది కాఫీ ,టీ తాగుతూ ఉంటారు. అప్పుడప్పుడు వీటిని తాగటం ఆరోగ్యానికి మంచిదే, కానీ టీ,కాఫీ ఎక్కువ తాగడం వల్ల కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. అందువల్ల ఈ రోజుల్లో ఎక్కువ మంది హెర్బల్ టీ తాగడానికి ఆసక్తి చూపుతున్నారు. వాటిలో ముఖ్యంగా లెమన్ గ్రాస్ టీ అలసట, మానసిక వత్తిడి నుండి విముక్తి కలిగిస్తుంది.

లెమన్ గ్రాస్ (నిమ్మ గడ్డి) మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ఎక్కువగా శ్రీలంక, దక్షిణ భారత దేశంలో లభిస్తుంది. ఈ మొక్కలో దాదాపు 55 జాతులు ఉన్నాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే వంటలలో వినియోగిస్తారు. లెమన్ గ్రాస్ తో టీ చేసుకొని తాగటం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. ఈ టీ తయారు చేయటానికి ఒక గిన్నెలో కొంచం నీరు పోసి, కొంచం లెమన్ గ్రాస్ నీ ఆ గిన్నెలో నిటారుగా ఉంచి నీటిని బాగా మరిగించాలి. తర్వాత ఆ నీటిని వడపోసి, ఒక ఐస్ క్యూబ్ వేసుకొని తాగాలి. లెమన్ గ్రాస్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

సాధారణంగా టీ తాగడం వల్ల రిలాక్స్ గా ఉంటుంది. కానీ ఈ లెమన్ గ్రాస్ టీ తాగటం వల్ల పని ఒత్తిడి వల్ల కలిగే అలసట, మానసిక వత్తిడి నుండి తొందరగా ఉపశమనం కలుగుతుంది. ఈ టీ శరీరంలో ఫ్రీరాడికల్స్ సమస్యను తగ్గిస్తుంది. ప్రతిరోజు లెమన్ గ్రాస్ టీ తాగటం వల్ల శరీరంలో జీర్ణక్రియ బాగా జరిగి, జీర్ణ సంబంధిత వ్యాధులు తలెత్తకుండా ఉంటాయి.

ప్రతిరోజు ఉదయం లెమన్ గ్రాస్ టీ తాగడం వల్ల ఆ రోజు మొత్తం ఎంతో హుషారుగా ఉంటుంది. ఈ టీ తాగటం వల్ల తరచూ వచ్చే జలుబు, దగ్గు ,జ్వరం వంటి ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. అధిక బరువు ఈ సమస్యతో బాధపడే వారు ప్రతిరోజు ఉదయం లెమన్ గ్రాస్ టీ తాగటం వల్ల వారి సమస్య నివారించవచ్చు. లెమన్ గ్ గ్రాస్ టీ తాగటం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు, చర్మ, జుట్టు సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.