Radhe Shyam : ఇన్సైడ్ టాక్ : “రాధే శ్యామ్” నుంచి ఒక బిగ్గెస్ట్ అనౌన్సమెంట్స్ రాబోతోందా??

Radhe Shyam : ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మరియు గత మూడేళ్ళుగా ఊరిస్తూ వస్తున్న భారీ చిత్రం “రాధే శ్యామ్”. దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమాని కంప్లీట్ క్లాస్ గానే తెరకెక్కించినా ఈ సినిమా రిలీజ్ కోసం మాత్రం మాస్ గా పాన్ ఇండియన్ విందే ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరి ఇదిలా ఉండగా ఎట్టకేలకు ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో ఈ జనవరి 14న సంక్రాంతి బహుమతిగా రిలీజ్ చెయ్యాలని చిత్ర బృందం నిర్ణయించిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ అనూహ్యంగా ఈ కొత్త సంవత్సరానికి అడుగు పెట్టడమే మరో భారీ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) వాయిదాతో నెల మొదలయ్యింది.

అయినా కూడా రాధే శ్యామ్ సినిమా రిలీజ్ లో ఎలాంటి మార్పు లేదని చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేశారు. కానీ ఈరోజు మాత్రం ఈ సినిమా రిలీజ్ పట్ల ఒక భారీ అనౌన్సమెంట్ ని ఇవ్వబోతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో ఇన్సైడ్ టాక్. ఒక అధికారిక ప్రెస్ నోట్ తో ఈ సినిమాని వాయిదా వెయ్యబోతున్నట్టుగా కన్ఫర్మ్ చేస్తారట.

ఆల్రెడీ నిన్నటి నుంచే ఇతర రాష్ట్రాల్లో పూర్తి స్థాయి లాక్ డౌన్ లు థియేటర్స్ మూసివేయడం స్టార్ట్ చేశారు. చెన్నై లో కూడా థియేటర్స్ మూసేసారు. ఈ కారణాల చేత రాధే శ్యామ్ విడుదల ఆగిపోయినట్టు తెలుస్తుంది. మరి పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో చూడాలి.