ఇండస్ట్రీ టాక్ : “బీస్ట్” కి సీక్వెల్ పై క్లారిటీ అనౌన్స్ చేసిన దర్శకుడు.!

ఈ ఏడాది భారీ అంచనాలు నడుమ రిలీజ్ అయ్యిన పలు సౌత్ ఇండియన్ సినిమాలలో తమిళ నాట స్టార్ హీరో థలపతి విజయ్ నటించిన భారీ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “బీస్ట్” కూడా తమిళ నాట అలాగే ఓవర్సీస్ లో భారీ వసూళ్లు అందుకున్న ఈ సినిమా విజయ్ కెరీర్ లో మరో మంచి హిట్ గా నిలబడింది.

అయితే ఓవరాల్ గా యావరేజ్ సినిమాగా మారిన ఈ సినిమాలో ఓ రకంగా తమిళ్ లో హిట్ గానే నిలిచింది. దీనితో విజయ్ అభిమానులు మాత్రం అంత డిజప్పాయింట్ అవ్వలేదు. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ అంటూ పలు వార్తలు పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి.

అయితే ఇది నిజమే అని డైరెక్టర్ చెప్పినట్టు తెలుస్తుంది. ఓ బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ బీస్ట్ కి రెండో సినిమా తీసేందుకు చాలా స్కోప్ ఉందని రానున్న రోజుల్లో బీస్ట్ 2 పడే ఛాన్స్ ఉందని ఇంట్రెస్టింగ్ లీడ్ ఇచ్చాడు. దీనితో ఇప్పుడు బీస్ట్ కి సీక్వెల్ ఉన్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది.

ఇంకా ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా అనిరుద్ సాలిడ్ మ్యూజిక్ అందించిన సంగతి తెలిసిందే. అలాగే సన్ పిక్చర్స్ స్టూడియో వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించారు.