ఇలా అయితే ‘RRR’ సినిమా పరిస్థితి ఏంటి?

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా వ్యాప్తి చెందించిన స్టార్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి. తన బాహుబలి సిరీస్ తో మొత్తం తెలుగుగు సినిమాని ఇంకో లెవెల్లో సెట్ చేసిన రాజమౌళి పుట్టినరోజు ఈరోజు కావడంతో శుభాకాంక్షలు వెళ్లువెత్తుతున్నాయి. సరే ఇది బాగానే ఉంది పక్కన పెడితే తాను తీసిన లేటెస్ట్ భారీ మల్టీ స్టారర్ పాన్ ఇండియన్ సినిమా RRR పరిస్థితే ఇంకా అంధకారంలో ఉండేలా ఉందనిపిస్తుంది.

ఎందుకంటే ఏపీలో థియేటర్స్ టికెట్ రేట్లు సమస్య ఇంకా సర్దుమణుగు కాలేదట. మునుపటిలా టికెట్ ధరలను పెంచడంపై ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన అయితే రాలేదని తెలుస్తుంది. ఇక దీనితో ఈ భారీ సినిమా సహా మిగతా సినిమాల పరిస్థితి ఇంకా ప్రశ్నార్థకంగానే ఉందని చెప్పి తీరాలి. ఒకవేళ అప్పటికీ కూడా ఈ సమస్య క్లియర్ కాకపోతే ఎంత పెద్ద హిట్ టాక్ వచ్చినా సినిమాలకు చేసిన బిజినెస్ అలాగే వాటిని రాబట్టడంలో భారీ నష్టాలు తప్పవని చెప్పి తీరాలి.