ఆకట్టుకున్న హీరో శివ కంఠమనేని డామిట్.. డేవిడ్ రాజుకు పెళ్ళై పోయింది టైటిల్ పోస్టర్..!

సాధారణంగా మనం ఏదైనా విషయంలో పలు సార్లు డామిట్ అనే పదం వాడడం వింటూ ఉంటాము. అయితే కన్యాశుల్కం సినిమా ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి ఈ డైలాగ్ ప్రస్తుతం డామిట్ డేవిడ్ రాజుకు పెళ్ళై పోయింది అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే షార్ప్ మైండ్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై ఈ చిత్రాన్ని కే. రామచంద్ర రెడ్డి, కిరణ్ కుమార్ గుడిపల్లి సంయుక్తంగా డామిట్… డేవిడ్ రాజుకు పెళ్ళై పోయింది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

జి వెంకట కృష్ణన్ దర్శకత్వంలో హీరో శివకంఠమనేని ఈ చిత్రం ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్లో ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ, ఉపాధ్యక్షుడు నెహ్రూ హీరో శివ కంఠం నేనే దర్శకులు మల్లికార్జున, గౌరీ రొనంకీ, నిర్మాతలు ఆచార్య శ్రీనివాస్ వంటివారు ఈ చిత్రంలో పాల్గొన్నారు.ఈ పూజా కార్యక్రమాలలో నిర్మాతల కే. రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఈ సినిమా కాన్సెప్ట్ నచ్చడంతో దర్శకుడు జీవీకే పై ఉన్న నమ్మకంతో మా బ్యానర్ పై ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం షూటింగ్ పనులను ప్రారంభించిన ఈ సినిమా లోని ఇతర నటీనటులను త్వరలోనే వెల్లడిస్తామని ఈ సందర్భంగా నిర్మాత రామచంద్రారెడ్డి తెలియజేశారు. అదేవిధంగా డైరెక్టర్ జీవీకే మాట్లాడుతూ..దర్శకుడిగా ఇది తనకు మూడవ చిత్రమని తనపై నమ్మకం ఉంచి ఈ సినిమా అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా ఎంతో అద్భుతమైన కథ మంచి కాన్సెప్టుతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఇప్పటికే రాజా సంగీత దర్శకత్వంలో పాటలు రికార్డ్ స్టార్ట్ చేశామని ఈ సందర్భంగా వెల్లడించారు. ఇక తాజాగా విడుదల చేసిన టైటిల్ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.