Esther Noronha: టాలీవుడ్ ఇండస్ట్రీలోకి భీమవరం బుల్లోడు సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అనంతరం ఆది సాయి కుమార్ నటించిన సినిమాలో ఐటమ్ సాంగ్ ద్వారా తెలుగు ప్రేక్షకులను సందడి చేసిన ముద్దుగుమ్మ
ఎస్తర్ నోరోన్హ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె నటించిన ఈ సినిమాలు ఏ విధమైనటువంటి గుర్తింపు తీసుకు రాలేదు. జయజానకినాయక సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా కూడా అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. ఈ క్రమంలోనే నటి ఎస్తేర్ సింగర్ నోయల్ ప్రేమలో పడి తనను పెళ్లి చేసుకుంది.
అయితే ఎవరూ ఊహించని విధంగా పెళ్లి అయినా ఆరు నెలలకే వీరు విడాకులు ప్రకటించడంతో ప్రతి ఒక్కరూ ఎంతో షాకయ్యారు.ఇలా వీరిద్దరి విడాకులతో విడిపోయిన తర్వాత నటి ఎస్తేర్ తాజాగా ‘69 సంస్కార్ కాలనీ’. మార్చి 4న ఈ మూవీ ప్రేక్షకులముందుకు రానుంది ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె ఈ సినిమా గురించి ఎన్నో విషయాలు తెలియ చేయడమే కాకుండా తన వ్యక్తిగత విషయాల గురించి నోయల్ తో విడాకులు గురించి కూడా తెలియజేశారు.
ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తనతో పెళ్లి అయిన తర్వాత నేను మా ఫ్యామిలీ తో కనెక్ట్ కాలేకపోయానని అయితే ఈ విషయాన్ని తన పేరెంట్స్ కి చెబితే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని తనలో తాను మదన పడ్డానని,ఇక చివరికి ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పడంతో వాళ్ళు కూడా నా గౌరవించి నాకు సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా ఉండడమే కాకుండా నాకు రెట్టింపు ఉత్సాహం కలిగించిందని ఈ సందర్భంగా ఈమె తెలియజేశారు.నోయల్ తో విడాకులు తీసుకున్న తర్వాత నేను చాలా సంతోషంగా ఉన్నానని అదే ఎనర్జీ తో నా కెరియర్ లో ముందుకు వెళ్తున్నానని తెలియజేశారు. విడాకుల ప్రకటన చేయగానే చాలామంది ఫోన్లు చేసి ఎందుకు ఇలా జీవితం నాశనం చేసుకున్నావు అని చెప్పిన వారు ఉన్నారు. నీకు అండగా మేమున్నాం అంటూ ధైర్యం చెప్పిన వారు కూడా ఉన్నారని ఈ సందర్భంగా ఈమె తెలియచేశారు.