Actress Hema: బాలకృష్ణ గారికి ఫోన్ చేసి ఓటు వెయ్యమని అడిగితే…. ఇలా అన్నారు: నటి హేమ

Actress Hema: మా అసోసియేషన్ ఎన్నికల సమయంలో తాను బాలకృష్ణ గారికి ఓటు వేయమని అడిగేందుకు ఫోన్ చేశానని, అప్పుడు వేరెవరో ఎత్తేసరికి తాను ఆయనతో మాట్లాడాలని అనుకుంటున్నట్టు అవతలి వ్యక్తితో చెప్పినట్టు సినీ నటి హేమ తెలిపారు. ఆ సమయంలో బాలకృష్ణ గారు మూవీ షూటింగ్‌లో ఉన్నారని, అంతే కాకుండా శ్రీకాంత్ కూడా అదే చిత్రంలో నటిస్తున్నారని ఆమె అన్నారు. ఆ టైంలో బాలకృష్ణ గారు శ్రీకాంత్ గారితో చెప్పారట తాను నీకు, హేమకు మాత్రమే ఓటేస్తానని అని హేమ చెప్పారు.

అలా బాలకృష్ణ గారు తనకు సపోర్ట్ చేశారని, తనకు చాలా ఆనందంగా అనిపించిందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఓటు వేయడానికి ఎలక్షన్‌ పాయింట్ దగ్గరికి వచ్చినపుడు కూడా ఆయన చాలా బాగా రిసీవ్ చేసుకున్నారని ఆమె తెలిపారు. ఆయనకసలు కల్లాకపటం ఉండదని, ఆయనంత బోలాశంకరుడు అని హేమ అన్నారు. ఆయనంత మంచి మనిషి ఇంకొకరు ఉండరని, ఆయనంటే తనకు చాలా ఇష్టమని కూడా ఆమె ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

ఇకపోతే ఆయన ఈ మధ్య ప్రారంభించిన టాక్ షో కూడా బాగా చేస్తున్నారని హేమ అన్నారు. అందరూ ఇప్పటికే ఆయన మాటల శైలిని, యాంకరింగ్‌ని అడాప్ట్ చేసుకున్నారని ఆమె తెలిపారు. ఆయన షో చూడకపోతే తన భర్తకు అసలు నిద్ర కూడా రాదని ఆమె చెప్పారు. ఆయన ఇప్పటి వరకు చేసిన అన్ని ఎపిసోడ్లు చూశామని ఆమె అన్నారు. హీరోలను ఇంటర్వ్యూ చేస్తుంటే కొంతమందికి పొగరుంటుందని, కానీ బాలకృష్ణ గారికి మాత్రం అది అస్సలు ఉండదని ఆయన చెప్పారు. సెట్‌లో కూడా తామిద్దరూ కలిస్తే నవ్వుతూనే సరదాగా ఉంటామని ఆమె వివరించారు.