Pushpa Movie: పుష్ప సెట్లో అల్లు అర్జున్‌కి నాకు ఈ విషయంలో పెద్ద డిస్కర్షన్ జరిగింది… అల్లు అర్జున్ తల్లి!

Pushpa Movie: తనను హీరో అల్లు అర్జున్ కలవగానే ముందు తనను అడిగిన ప్రశ్న ఏంటంటే అమ్మా.. మీ ఏజ్ ఎంత అని అడిగినట్టు పుష్ప సినిమా ఫేమ్, ఆర్టిస్ట్ కల్పలత తెలిపారు. దానికి సమాధానంగా తనకు 42 అని చెబితే, 42 ఆ అని ఆశ్చర్యపోయారని, ఆ తర్వాత నీకు ఎంత మంది పిల్లలమ్మా అని అడిగారని ఆమె చెప్పారు. ఇద్దరు అబ్బాయిలు అని చెబితే, వాళ్లేం చదువుకుంటున్నారు అని అడిగితే, వాళ్లు జాబ్ చేస్తున్నారని తాను చెప్పినట్టు కల్పలత తెలిపారు.

ఇలా తాను ఏ సమాధానం చెప్పినా అల్లు అర్జున్ గారు షాకింగ్‌గా ఎక్స్‌ప్రెషన్స్ పెట్టారని ఆమె నవ్వుతూ చెప్పారు. పెళ్లి ఎప్పుడైందని కూడా తనని ఆయన అడిగినట్టు ఆమె చెప్పగా, అంతలోనే సుకుమార్ సర్ రావడంతో టాపిక్ అక్కడితో ఆగిపోయిందని ఆమె తెలిపారు. ఆ తర్వాత మళ్లీ అవే ప్రశ్నలు అడిగారని ఆమె చెప్పారు. నిజంగా మీరు చెప్పినవి నిజాలా అమ్మా, నాకూ నీకూ ఎంత ఏజ్ తేడానో తెలుసా, 2 సంవత్సరాలు తేడా అని ఆయన చెప్పినట్టు ఆమె తెలిపారు.

దానికి ఆమె ఏమీ అనకుండా ఉన్నానని, ఎందుకంటే ఆయన తన కంటే ఏజ్‌లో పెద్ద వాడు కాకపోయినా ఇండస్ట్రీలో పెద్దవారు కాబట్టి ఏం అనలేకపోయానని ఆమె చెప్పారు. ఆ తర్వాత ఆయన నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారని కల్పలత అన్నారు. దాని తర్వాత సుకుమార్‌తో మళ్లీ అల్లు అర్జున్ మాట్లాడుతూ డాలీ, మా అమ్మకూ, నాకూ ఎన్ని సంవత్సరాల ఏజ్‌ తేడానో తెలుసా, రెండు సంవత్సరాలే అని నవ్వుకుంటూ చెప్పారని ఆమె వివరించారు. ఇలా ఈ విషయం గురించి అల్లు అర్జున్ కు నాకు మధ్య పెద్ద డిస్కషన్ జరిగిందని, ఈ సందర్భంగా కల్పలత ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.