Samantha: 500 కోసం అలాంటి పనులు చేయాల్సి వచ్చింది:సమంత

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సమంతా విడాకుల తరువాత మరింత యాక్టివ్ గా ఉంటూ ఒకవైపు వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. మరొక వైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న సమంత ఒకానొక సమయంలో కేవలం రోజుకు 500 రూపాయల కోసం పని చేసిందట. ఇదే విషయాన్ని సమంతనే స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మొదట ఏ మాయ చేశావే సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది సమంత. సమంత కూడా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వక ముందు ఎన్నో కష్టాలను అనుభవించిందట.

ఈమె చదువులో టాప్ స్టూడెంట్ అయినప్పటికీ పై చదువులు చదువుకోవడానికి డబ్బులు లేక చదువు మానేయాల్సి వచ్చింది అని ఆమె తెలిపింది. అదేవిధంగా సమంత హీరోయిన్ కాకముందు పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్ లో ఫంక్షన్లకు హాజరై గెస్ట్ లకు వెల్కమ్ చెప్పే అమ్మాయిగా కూడా పని చేసిందట. అందుకోసం ఆమెకు రోజుకు 500 రూపాయలు ఇచ్చేవారని తెలిపింది. ఇంకా కొన్ని కొన్ని సమయాలలో డబ్బులు లేక ఒక పూట మాత్రమే భోజనం చేసేదానిని అని తెలిపింది. అలా ఒక్క పూట భోజనం చేసి దాదాపు రెండు నెలలు గడిపాడని సమంత చెప్పుకొచ్చింది.

ఇక పాకెట్ మనీ కోసం మోడలింగ్ వైపు వెళుతున్న సమయంలో కుటుంబ సభ్యులతో పాటు ఇంకొందరు నీకు ఇది అవసరమా అంటూ నన్ను వెనక్కి లాగే ప్రయత్నం చేశారు అని ఆమె చెప్పుకొచ్చింది. కానీ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఆమె ముందడుగు వేసినట్లు చెప్పుకొచ్చింది. ఇకపోతే సమంత ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, హాలీవుడ్ లో సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. మొత్తానికి సమంత ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉంది అని చెప్పవచ్చు.