Manik Reddy: త్రివిక్రమ్‌ గారిని చాలా ఇబ్బంది పెట్టాను.. బహిరంగ సారీ చెప్పిన నటుడు మాణిక్ రెడ్డి!

Manik Reddy: త్రివిక్రమ్ తనకు పరిచయమైన సమయంలో ఆయన చాలా ఇబ్బందుల్లో ఉన్నారని మాణిక్ రెడ్డి అన్నారు. అప్పట్లో ఆయన టీవీ సీరియల్స్‌లో పేరు లేకుండా రాసేవారని, పోసాని కృష్ణ మురళి దగ్గర పని చేశారని కూడా ఆయన చెప్పుకొచ్చారు. తాను ఆ రోజుల్లో ఎవరికైనా సహాయం కావల్సి వస్తే, ఏదైనా ఇబ్బంది వస్తే పరిష్కారం చేశానని ఆయన తెలిపారు.

తన తోటి స్నేహితులు ఒక స్థాయికి వచ్చాక కూడా తాను మాత్రం పైకి రావడం చాలా సమయం పట్టిందని మాణిక్ అన్నారు. ఒకానొక టైంలో ఎడారిలో తానొక్కడినే ఉండిపోయానా అని అనిపించేదని ఆయన తెలిపారు. కానీ చాలా సినిమాల్లో వెనకాల స్టాండింగ్‌లో ఉన్నానని ఆయన చెప్పుకొచ్చారు.

అయితే తాను త్రివిక్రమ్ దగ్గరికొచ్చి తనకు అవార్డొచ్చిందని చెబితే, ఏం అవార్డు అని ఆయన అడిగితే, దానికి తాను బెస్ట్ స్టాండింగ్ అవార్డు అని చెప్పానని ఆయన నవ్వతూ తెలిపారు. అదేంటీ మాణిక్ అలా అంటావు అని అంటే, అందరూ ఏడిపిస్తున్నారు. త్రివిక్రమ్ ఫ్రెండ్‌వి అయ్యుండి ఇంకా ఇలా ఉన్నావేంటీ అని తాను అన్నట్టు ఆయన చెప్పారు.

నిజం చెప్పాలంటే తాను త్రివిక్రమ్‌ను చాలా ఇబ్బంది పెట్టానని మాణిక్ రెడ్డి తెలిపారు. ఆయన ఇబ్బందుల్లో సమయంలో తాను ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టానని, సారీ అంటూ తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఓపెన్ అయ్యారు. ఎందుకంటే ఆయనకు ఒక పొజిషన్ వచ్చాక కూడా తాను బ్యాక్‌లోనే ఉండిపోయేసరికి ఆయనపై ఒత్తిడి ఎక్కువైందని మాణిక్ రెడ్డి అన్నారు. తన పిల్లలు కూడా నాన్నా నువ్వు త్రివిక్రమ్ ఫ్రెండ్ కదా ఇంకా ఇలా ఉన్నావ్ అని, సొసైటీలోనూ తాను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆయన చెప్పారు. అవన్నీ కూడా త్రివిక్రమ్‌పై స్ట్రెస్‌ను పెంచాయని ఆయన వివరించాయి.