లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఫరిదిలో కరోనా ఉగ్ర రూపం దాల్చుతోన్న సంగతి తెలిసిందే. ఊహించని విధంగా కేసులు పెరిపోతున్నాయి. యావరేజ్ గా ఒక్క జీహెచ్ ఎంసీలో రోజూ 500 కు పైగా కేసులు నమోదవుతున్నాయి. దాదాపు సీటీ అంతా కరోనా చుట్టేస్తోంది. సిటీకి దూరంగా ఉన్న కాలనీల్లోనూ కరోనా మాటేసి కాటేస్తోంది. శనివారం ఒక్కరోజే 100కిపైగా కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో 888 కేసులు జీహెచ్ ఎంసీలోనే ఉన్నాయి. దీంతో స్థానిక ప్రజలకు బెంబేలెత్తిపోతున్నారు. బయటకు రావాలంటే భయపడిపోతున్నారు.
దీంతో ప్రభుత్వం మరోసారి సిటీలో లాక్ డౌన్ దిశగా సన్నాహాలు చేస్తోంది. కట్టడికి సంబంధించి నాలుగు రోజుల్లో వ్యూహం సిద్దం చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. నేడు సీఎం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం తీసుకు న్నారు. దీనిపై వ్యూహం, అవసరమైతే లాక్ వేసేలా ప్రణాళికలు సిద్దం చేయాలని సూచించారు. అయితే సిటీలో లాక్ డౌన్ విధించాలంటే చాలా అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. లాక్ డౌన్ కట్టుదిట్టo, పటిష్టంగా అమలు చేయాలంటే ముందు ఎక్కడి జనాలు అక్కడే ఉండాలి. అవసరమైన నిత్యావసర సరుకులు ఏర్పాటు చేసుకోవాలి. తెరుచుకున్న ఆఫీసులు, ప్రయివేట్ వ్వవహారాలకు సంబంధించి విధి విధానాలు రూపొందించుకోవాలి.
అలాగే రోజు రెండు మూడు గంటలు మాత్రమే అనుమతివ్వాలి. మిగతా అన్ని గంటల్లో కర్ఫ్యూ విధిగా విధించాల్సి ఉంటుంది. అందుకు మళ్లీ పోలీసులందర్నీ రంగంలోకి దించాల్సి ఉంటుంది. ఇప్పటికే కొంత మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో పోలీసులు అందుబాటులో ఉండే అవకాశం కూడా ఉండదు. ఉన్న సిబ్బందితోనే లాక్ డౌన్ అమలు పరచాల్సి ఉంటుంది. ఈ విషయాలన్నింటిపై ప్రభుత్వం లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.